Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):
6, 7 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో అజయ్ బాబు విస్తృత ప్రచారం….
మండపేట లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి విజయమే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ బాబు 6, 7వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూ ప్రజా సంక్షేమానికి భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అజయ్ బాబు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆరో వార్డు అభ్యర్థి కాటా లక్ష్మి, ఏడో వార్డు అభ్యర్థి ముల్లు ఇందిరాతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.యువత భవిష్యత్తు, పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కూటమికి మద్దతు తెలిపి అభ్యర్థులను గెలిపించాలని వేగుళ్ల అజయ్ బాబు ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమై కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మల్లిపూడి గణేష్, మచ్చ నాగు,కాట గోపి, పాండ్రంగి సత్యనారాయణ, కాకి మంగాదేవి, విశ్వనాథమ్, మసిన పళని, మెర్ల భగవాన్, మెర్ల సత్యనారాయణ, బండారు సతీష్, మొరం బాలాజీ, కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.