08:47 PM, 1 Monday March 2021

రాయవరం నూతన ఎస్సైగా పి.వి.ఎస్ ఎస్ ఎన్ సురేష్

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాయవరం ఎస్సై గా పి వీ ఎస్ ఎస్ ఎన్ సురేష్ గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. అమలాపురం నుండి రాయవరం ఎస్సై సురేష్ బదిలీపై వచ్చారు. ప్రస్తుతం రాయవరం పోలీస్ స్టేషన్ ఎస్సైగా కొనసాగుతున్న ఎల్ శ్రీను నాయక్ కాకినాడ ఎస్పీ ఆఫీస్ కు వి ఆర్ కు బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్సై స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ప్రజలకు తమ వంతు న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తానని అలాగే, మండలంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సురేష్ కు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై ఐ పి వెంకటేశ్వర్లు, స్టేషన్ రైటర్ బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్ రైటర్ రొక్కల శ్రీను, హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, కానిస్టేబుల్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#