04:46 AM, 3 Wednesday March 2021

ర్యాలీ గ్రామంలో మనం- మన పరిశుభ్రత అవగాహనా కార్యక్రమం

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మండలం ఎంపిడిఓ నాతి బుజ్జి అన్నారు. బుధవారం మండలం పరిధిలోని  మనం-మన పరిశుభ్రత గ్రామాలన్నిటిలో   అందరు పంచాయతీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారుల ఆద్వర్యంలో స్థానిక నాయకులు, అన్ని శాఖల గ్రామ స్థాయి అధికారులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి వ్యర్థం పై వ్యతిరేక పోరాటం కార్యక్రమాలను  ప్రారంభించినట్లు  ఎంపీడీఒ నాతి బుజ్జి తెలిపారు.  ర్యాలి గ్రామంలో జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీడీఒ మాట్లాడతూ పారిశుధ్యం అనేది కేవలం గ్రామ పంచాయతీ బాద్యత మాత్రమే కాదనీ, ప్రజలంతా ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేయకుండా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, చెత్త సేకరణకు ట్రాక్టరు ను బాగుచేయించామనీ, పన్నెండు మంది గ్రీన్ అంబాసిడర్ లను ఏర్పాటు చేసామనీ తెలిపారు.ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్ లకు అవసరమైన దుస్తులు, గ్లోవ్స్ అందజేశారు.సుమారు 400 డస్ట్ బిన్ లు ఇచ్చేందుకు గ్రామ పెద్దలు, ఉద్యోగులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు  బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, మెర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ వేతనదారులు , దుకాణదారులు అన్ని వర్గాల వారిని ఈ ఉద్యమం లో భాగస్వామ్యం చేస్తూ, వారి అలవాట్లలో మార్పు వచ్చేలా, వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని  అన్నారు.గ్రామంలో అవగాహనా ర్యాలి నిర్వహించి దుకాణాల వారికి, ప్రజలకు అవగాహన కల్పించారు.   వాలంటీర్ల ద్వారా ప్రతీ ఇంటికి కరపత్రాల ద్వారా ఈ సమాచారం చేరాలని పంచాయతీ కార్యదర్శి కృష్ణ తెలిపారు.  ఈ కార్యక్రమంలో, అందరు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#