రామచంద్రపురం ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఎన్.జి.సి. వర్క్‌షాప్

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం పట్టణంలోని ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాలలో కె.గంగవరం మరియు రామచంద్రపురం మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులందరి కొరకు నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్.జి.సి.) ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాప్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి. రామలక్ష్మణ మూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమానికి రామచంద్రపురం ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. వీరరాఘవ రెడ్డి అధ్యక్షత వహించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్.జి.సి. కోఆర్డినేటర్...