03:18 AM, 2 Tuesday March 2021

ఈ నెల నుండి రేషన్ కార్డుల రేషన్, ప్రయోజనాలు కట్ ?

వెబ్‌డెస్క్ :

ఈ డిసెంబర్ నెల నుండి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే రేషన్ ను పూర్తిగా నిలుపుదల చేసింది. అలాగే వారి కార్డులను కూడా ఎటువంటి నోటీసు లేకుండా రద్దు చేయడం జరుగుతున్నది. ఇదేమిటని రేషన్ డిపోల డీలర్లు ను అడిగితే వారు ఏవో ప్రభుత్వం కొన్ని నిబంధనల మేరకు కార్డులను రద్దు చేస్తూన్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని చెబుతున్నారు . కానీ రేషన్ కార్డు దారులుల్లో పేద , దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కి చెంది ఉన్న కుటుంబాలకు రేషన్, ప్రభుత్వ పధకాలను అందరికీ ప్రకటించడం జరగలేదు. అలాగే కూడా ఇప్పటివరకు ప్రభుత్వం వారి సూచనల మేరకు ఇన్కంటాక్స్ రిటర్న్స్ పేరుతో, కారును ( టాక్సీ) కలిగి ఉన్న వారికి మరియు కరెంట్ బిల్లు అధికంగా వచ్చే వారికి రేషన్ కార్డులను తొలగించి, రేషన్ నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కానీ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండాల్సిన బాధ్యత , అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ పెట్టదు… అడుక్కో నివ్వదు అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందని మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ బిసి , ఎస్సి , ఇతర దిగువ తరగతి కులాల విద్యార్థులకు,ప్రజలు కు వృత్తి, ఉపాధి లోన్లు ఇవ్వడం లేదు. ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులు ( కొందరికి ఇచ్చినా …ఎక్కువ శాతం అర్హులకు అందలేదు) స్టయిపెన్డ్ , విద్యాదీవెన పధకాలను అర్హులు కారు అన్నట్లుగా ప్రభుత్వం భావిస్తున్నది. ప్రజలు, మధ్య తరగతి ప్రజలు కు ప్రస్తుతం దేశ కాలమాన విద్యార్థులకు కొన్ని సందర్భాలలో వివిధ అవసరాల కోసం ఏదైనా విద్యా మరియు ఇతర రుణ అవసరాల కోసం బ్యాంకులు నుండి లోన్ నిమిత్తం బ్యాంకులలోకి వెళ్తే అక్కడ పాన్ కార్డు , ఇన్ టాక్స్ రిటర్న్స్ 3 ఏళ్ళు కడితేనే ఇస్తున్నారు… వాటిని అత్యంత ప్రాధాన్యత కలిగించేలా చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు విధించి ప్రభుత్వ ప్రయోజనాలను మధ్యతరగతి వారిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చర్యలున్నాయని బాధిత కార్డుదారులు అంటున్నారు. ఈ నిబంధనలు కొన్ని అక్రమంగా రేషన్, పధకాలను పొందే వారికి అర్హులు గా చేసిన వారికి సమర్థించే విధంగా ఉండాలని, అసలు మధ్యతరగతికి ఎటువంటి సంక్షేమం ఈ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించేలా చర్యలు లేదని వాపోతున్నారు . అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రభుత్వం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు మరియు దిగువ మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేయనప్పుడు ఈ ప్రభుత్వం మాకెందుకు మాకు ఏమి చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. మా కష్టాలు ప్రభుత్వంకు పట్టవా ? పన్నులు కట్టే సొమ్మును వారి సొంత ప్రాపకాలు కొరకు అనర్హులకు పధకాలను, ఇండ్లు, ఇళ్ళ స్థలాలు ఎలా పంపిణీ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#