01:01 AM, 2 Tuesday March 2021

జీవవైవిధ్యంలో రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జీవవైవిధ్యం మరియు పరిరక్షణలో రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం బోటనీ విభాగం మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నేషనల్ వెబినార్ ను నిర్వహించారు. ‘ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ బయోడైవర్సిటీ అసెస్‌మెంట్‌’ అనే అంశంపై జరిగిన ఈ వెబినార్ కు వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జీవవైవిధ్యం పరిరక్షణలో విశేషమైన మార్పు తీసుకురావచ్చని అన్నారు. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ కోసం అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ పై అధ్యయనాలు చేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతుందని దానిని సమాజ హితం కోసం ఉపయోగించే విధంగా పరిశోధనలు జరగాలని తెలిపారు. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ డా.కె.రమణేశ్వరి, ఈసీ మెంబర్ ఆచార్య జె.సుజాత, వక్తలు డా.సి.సుధాకర్ రెడ్డి, డా.ఎస్.నాగరాజు, విభాగ అధ్యాపకులు కన్వీనర్ డా .కె. సామ్యుల్ కుమార్, ఎం. ప్రజ్ఞ, డా.వి.పద్మావతి, డా.ఎల్. ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#