జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన భార్గవ్
నవంబర్ 1 నుండి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలు
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాయవరం హైస్కూల్ విద్యార్థి ఎంపికైనట్లు శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విప్పర్తి శాంతి సునీత శుక్రవారం తెలిపారు. పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ ఇటీవల కాలంలో అనపర్తిలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో అధ్బుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, నవంబర్ 1వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో భార్గవ్ పాల్గొంటారన్నారు.
కాగా వాలీబాల్ క్రీడలో ప్రతిభను కనుబరిచి, పాఠశాలకు గుర్తింపు తెచ్చిన పోలిశెట్టి భార్గవ్ ను అతనికి క్రీడలో తర్ఫీదును ఇచ్చిన పాఠశాల పీ.డీలు చిక్కాల అంజి బాబు, కందర్ప శ్రీనివాస్ లను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

