తంటికొండ దళితవాడలో పారిశుధ్య సమస్యలు
GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK): తంటికొండ: సంజీవయ్య నగర్ దళితవాడలో డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో దోమలు, మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు సీజనల్ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు, శానిటేషన్ సిబ్బంది వెంటనే స్పందించి డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.