05:11 AM, 3 Wednesday March 2021

సీజన్ వ్యాధులు పట్ల అప్రమత్తత అవసరం…

◘ వాంతులువిరోచనాల భయం…
◘ కాచి వడబోసిన నీళ్లే సురక్షితం…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఏడాదంతా కరోనా మహమ్మారి భయం తో ప్రజల జీవన స్థితిగతులు  పూర్తి గా మారిపోయాయి. ఓడలు బళ్ళు అయ్యాయి. ఆర్థికంగా కుదెలయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త  సాధారణ స్థితి నెలకొన్న పరిస్థితి. ఈ క్రమంలో కొత్త వ్యాధులు పంజా విసురుతున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా లేకపోతే పొంచి ఉన్న వ్యాధులు ముసిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పై శ్రద్ధ పెట్టకపోతే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని రీతిలో వాంతులు విరేచనాలతో వందల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా మంచినీరు కలుషితమవుతున్నాయని దీని వల్లే  అస్వస్థతకు గురి అవుతున్నారని వైద్యుల చెబుతున్నారు. ఖచ్చితంగా కాచి వడబోసిన నీరు సేవించాలని చెబుతున్నారు. మనకేం కాదులే అన్న నిర్లక్ష్యం పనికి రాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు ముందస్తుగా మేలుకొని కలుషిత ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా సురక్షితమైన మంచి నీటిని తీసుకోవాలి. చలికాలం సీజన్ కావడంతో ఎక్కువగా వాంతులు విరోచనాలు లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికోసం ప్రజలు  చల్లారిన ఆహారం కాకుండా ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహారం తీసుకోవాలి. రోడ్ లపై విక్రయించే తినుబండారాలపై నిత్యం ఈగలు ముసురు తుంటాయి.వీటి జోలికి వెళ్లకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#