జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన జె. సురేష్ కుమార్
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె. గంగవరం మండలం, శివల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జె. సురేష్ కుమార్ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ తన ప్రతిభను చాటుకోవడం విశేషం. మాస్టర్ అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రస్థాయి మాస్టర్...