VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 4:06 pm Posted by : Chandu

జిల్లా స్థాయి క్రీడలకు శ్రీ రామయ్య జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

 

రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్:

 

తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల శ్రీ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల మండపేటలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అండర్-17 అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాస్కెట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, యోగ, కోకో విభాగాల్లో మొత్తం పలువురు విద్యార్థులు అర్హత సాధించారు. ఎంపికైన క్రీడాకారులను ఉప విద్యాశాఖ అధికారి పత్తి రామలక్ష్మణమూర్తి, మండల విద్యాశాఖ అధికారి రాంబాబు, ప్రధానోపాధ్యాయురాలు విప్పర్తి శాంతి సునీత, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, పీడీలు సీహెచ్ అజ్జిబాబు, కె. శ్రీనివాసు తదితరులు అభినందించారు.