గుర్రపు డెక్కతో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు
కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): కాలువల్లో పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారుతున్న గుర్రపు డెక్కను సంపదగా మార్చి, డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. కరప మండలం గొర్రిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీఆర్డీఏ–సెర్ఫ్ ఆధ్వర్యంలో కరప, కాజులూరు మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కతో వివిధ కళాకృతులు, బొమ్మల తయారీపై నిర్వహిస్తున్న నెల రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రియతో...