02:57 PM, 3 Wednesday March 2021

అన్నం పెట్టే రైతన్నకు ఆవేదన తప్పదా?

◘ చలిలో ఉన్న రైతులను చూసి చలించని కేంద్ర ప్రభుత్వం
◘ కార్మిక సంఘాలు,రైతు సంఘాల అద్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో భారత్ బంద
◘ మద్దతిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం

రామచంద్రపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతుల సమస్యల పరిష్కారంకోసం చేసిన భారత్ బంద్ రామచంద్రపురంలో విజయవంతమైనది. సిపిఐ,సిపిఎమ్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు, కార్మిక సంఘాలు,రైతు సంఘాల అద్వర్యంలో స్థానిక పట్టణంలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు రాము, ఎంవి రమణ,జి.సూరిబాబు, వి. భీమ శంకరంలు మాట్లాడుతూ రైతుల సమస్యలపై దేశ రాజధాని ఢిల్లీలో కోటి 20 లక్షలమంది గత 12 రోజులుగా పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు.ఇది దుర్మార్గమైన చర్య అని వాపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రైతులు ఇంత పెద్దసంఖ్యలో పోరాడి ఇన్ని రోజులు రోడ్డులపై ఉండటం ఇదే మొదటిసారనీ తెలియజేశారు.డిల్లీలో ఉన్న చలికి నలుగురు రైతులు చనిపోయారు మరింతమంది ప్రాణాలు పోకముందే కేంద్రం రైతుల సమస్యలు పరిష్కారం చెయ్యాలన్నారు.ఈ బిల్లులు అమల్లోకి వస్తే రైతులకే కాదు సామాన్య ప్రజలకు కూడనష్టం వాటిల్లుతుందన్నారు.12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 రైతు సంఘాలు,12 రాజకీయ పార్టీలతో పాటు రైతు పక్షపాతి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటానికి మద్దతు పలికింది.కేంద్రం మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమనికి మద్దతుగా ఎల్ఐసి నాయకులు రామారావు, కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు , ఏఐటీయూసీ యు.గోపాలరావు మద్దతుని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు శారదా,నాగభూషణం,సత్యనారాయణ, దుర్గమ్మ ,కుమారి,గణేష్,రాంబాబు,రాజు,రాంబాబు,గౌస్ ,గోవిందు,భగవాన్,నారాయణ,కృష్ణ, లాజర్, వెంకట్రావు,దుర్గాప్రసాద్ మొదలైనవారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#