భక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి

సమస్యలు తీర్చాలని మొక్కుతూ కులదేవతకు సారె సమర్పణ   రాయవరం గ్రామ ప్రజల మేలుకోరి దేవాంగసంఘం పూజలు   రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:   దేవాంగుల కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం రాయవరం గ్రామంలోని మఠం వీధిలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ పూజా కార్యక్రమానికి దేవాంగ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. కులదేవత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఈ ఏడాది తొలిసారిగా...