Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 5:38 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 5:38 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 5:38 PM
Follow Us

ఓడలరేవులో రూ.20 లక్షలు విలువ చేసే జేసీబీ, ఇతర సామాగ్రి మాయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:

అల్లవరం మండలం ఓడలరేవులో రూ.20 లక్షలు విలువ చేసే మూలన పడి ఉన్న భారీ క్రైన్, జేసీబీ,కాంక్రీట్ మిక్సర్,రెండు టిప్పర్ ట్రక్కులుపై కొందరి అక్రమార్కుల కన్ను పడింది.అక్రమార్జనే దెయ్యంగా పెట్టుకున్న అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొన్ని రోజుల క్రితం మూలన పడివున్న మిషనరీలను అమ్మేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే. ఈబాగోతానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓడలరేవు ఓఎన్జిసి ఆన్ షోర్ టెర్మినల్ పరిధిలో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఓ కాంట్రాక్టు దారుడు మూడేళ్ల క్రితం నష్టాలతో ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఓడలరేవు టెర్మినల్ ఎదురుగా కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించిన మిషనరీని అక్కడే వదిలేశారు. వీటికి యజమాని పాండా అనే పేరుగల వ్యక్తి అని తెలుస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఇక్కడ సదరు కాంట్రాక్ట్ పనులు నిర్వర్తించేందుకు,రాకపోగా ఓడలరేవు ఓఎన్జిసి టెర్మినల్ ఎదురుగా జెసిబి, క్రైన్, కాంక్రీట్ మిక్సర్, రెండు ట్రక్కు టిప్పర్లు ఇతర సామాగ్రిని అలానే వదిలేశారు. అయితే ఇవి గత మూడేళ్లుగా అక్కడే ఉండిపోవడంతో అవి పాడైన పరిస్థితిలోకి వెళ్లాయి. వీటిపై కొందరి కన్ను పడింది. ఆదేగ్రామానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ములు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం పాత ఇనుము దుకాణదారులకు స్క్రాప్ గా విక్రయించేందుకు వీటిని కట్ చేసి విడిభాగాలుగా వేరు చేశారు. రాత్రికి రాత్రి ఓడలరేవు నుంచి వీటిని తరలించారు. అయితే ఆ సమయంలో ఈ తంతును చూసిన అదే గ్రామానికి చెందిన కొందరిని బుజ్జగించేందుకు వారు అక్రమంగా అమ్మగా వచ్చిన సొమ్ములో వాటాలు పంచారు. ఈ మొత్తం దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓడలరేపు గ్రామంలో జరిగే ప్రతి పనిలోనూ దళారులుగా వేలు పెట్టి కమిషన్లు వసూలు చేసే ఈ ముఠా గ్రామంలో ఏది వదలడం లేదని కొందరు గ్రామస్తులు దీనిని బయట పెట్టడంతో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది. దాదాపు 20 లక్షల రూపాయలకు వీటిని విక్రయించి అందులో అగ్ర భాగం కొందరు తీసుకోగా మిగిలినది మరి కొంత మందికి పంచినట్లు సమాచారం. అయితే ఈ తంతును పరిశీలించిన కొందరు గ్రామస్తులు స్క్రాప్ గా అమ్మిన వాటి ద్వారా వచ్చిన సొమ్ము పై ఆరా తీయగా సదర్ కాంట్రాక్టు దారుడు తమకు బాకీ పడి ఉన్నాడని ఒకసారి. గ్రామాభివృద్ధిలో ఈ డబ్బులు వాడుతున్నామని మరోసారి. కుంటి సాకులు చెప్పుకురావడం దారుణమని ఆ గ్రామస్తులు కొందరు మండిపడుతున్నారు. ఓఎన్జిసికి అత్యంత సమీపంలోనే బాహాటంగా జరిగిన ఈ దోపిడి ఇల వీటిని అడ్డుకునే నాధుడే కరివయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడలరేవు కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాలు రోజు,రోజుకు,పెచ్చు మీరి పోతున్నాయని,పోలీసులు రంగ ప్రవేశం చేసి నిజాలు నిగ్గు తేల్చి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఓడలరేవులో రాత్రికి,రాత్రే, అక్రమార్కులు,మూలన పడి ఉన్న మిషనరీలను అమ్మేసిన వారిపై నమోదు చేశారా అని ఫోన్లో అల్లవరం ఎస్సై శ్రీను నాయక్ ను వివరణ కోరగా,మిషనరీలు అమ్మేసిన వారిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని,కాంట్రాక్ట్ దారుడు,వారి కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు ఫిర్యాదు చేస్తే,అక్రమార్కులపై కేసు నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వివరణ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement