Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 10:09 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 10:09 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 10:09 AM
Follow Us

విలేఖరిని తీవ్ర పదుజాలంతో దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

మండలం వెంటూరు గ్రామ సచివాలయంలో (2)లో ఒప్పంద పద్ధతిలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న నున్న రాజ్ కుమార్ వ్యక్తి తన విధులకు క్రమంగా హాజరవ్వడం లేదన్న సమాచారంతో గురువారం 1-12-2022 న పెన్షన్ తీసుకునే క్రమంలో గ్రామంలో అక్కడకు వెళ్ళిన విలేఖరి ఖండవిల్లి భరత్ కుమార్ అక్కడే ఉన్న సర్పంచ్ , సెక్రటరీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ భరత్ కుమార్ కి నున్న రాజకుమార్ ఫోన్ చేసి రాయలేని విధంగా తీవ్ర దుర్భాషలాడుతూ నరికేస్తాను, పొడిచేస్తాను, నీ రెండో కాలు తిప్పేస్తాను అంటూ అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డాడు. తాను విలేఖరినని, విధి నిర్వహణలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యను అడిగి తెలుసుకునే క్రమంలో సదరు అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నానని భరత్ తెలిపారు. అయినా రాజకుమార్ వినకుండా దుర్భాషలాడదునితో భయభ్రాంతులకు గురైన తాను ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు భరత్ తెలిపారు. ఈ ఘటనపై అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ బొడ్డపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ 2016 వికలాంగులు చట్టం ప్రకారం రాజ్ కుమార్ పై చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. రాయవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వీర్రాఘవరెడ్డి , సభ్యులు తీవ్రంగా ఖండించారు. కాగా భరత్ పై దుర్భాషలాడిన నున్న రాజ్ కుమార్ పై వెంటనే కేసు నమోదు చేయాలని,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని రాఘవరెడ్డి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆయా పత్రిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement