Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అక్రమ మైనింగ్….బ్లాస్టింగ్ లో భార్య భర్తల మృతి…..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*ప్రాణాలను బలిగొంటున్న అక్రమ క్వారీలు…
*క్వారీలు నిర్వహణబలా… భద్రత డొల్ల..
*చోద్యం చూస్తున్న మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు…

విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్, రౌతులపూడి:

మండలంలో ములగపూడి, తిరుపతమ్మపేట, ఎస్ పైడిపాల, ఉప్పంపాలెం, రాఘవపట్నం, మల్లంపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న అక్రమ నల్లరాయి క్వారీలలో నిత్యం ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. గత 20 రోజుల క్రితం తిరుపతమ్మ పేట రెవెన్యూ సర్వే నంబర్ వన్ లో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ లో మల్లంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. అది మరవక ముందే ఎస్ పైడిపాల గ్రామంలో భార్యాభర్తలు మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్ పైడిపాల సర్వే నెంబర్ 15 లో బుధవారం అక్రమ క్వారీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోలోజు వరహాలు(28), పోలోజు లక్ష్మీ దుర్గ భవాని(25) మృతి చెందారు. బుధవారం సాయంత్రం సుమారు 4:30 నుండి 5 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్ళినా భార్యాభర్తలు కనిపించకపోయేసరికి గ్రామస్తులు బ్లాస్టింగ్ చేసిన క్వారీ వద్దకు వెళ్లి చూడగా వీరు వెళ్లిన పల్సర్ బైక్ ఏపీ31 డి యు7195 నెంబర్ గల బండి క్వారీ వద్ద ఉండడంతో వీరు బ్లాస్టింగ్ కు బలి అయిపోయినట్లు గ్రామస్తుల నిర్ధారించి అర్ధరాత్రి నుండి పోలీస్ వారి సహకారంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శిధిలాల తొలగిస్తుండగా మృతదేహాలు బయటపడ్డాయి. మృతి చెందిన భార్యాభర్తలకు ఇద్దరు ఆడపిల్లలు కలరు. మీరు ఇరువురు ఒకరిని ఒకరు ఇష్టపడి 2014లో పెళ్లి చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పేలుళ్ల దాటికి వీరి శరీరాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. వీరి మృతదేహాలను చూసిన బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్వతం అయ్యారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎస్ పైడిపాల మాజీ సర్పంచ్ ఈగల సత్తిబాబు ఆధ్వర్యంలో అక్రమ క్వారీ ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణ ఏర్పడింది. తుని రూరల్ సీఐ ఏ సన్యాసిరావు, కోటనందూరు ఎస్సై పంచాడ స్వామి నాయుడు ఆందోళనకారులతో చర్చించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న తాసిల్దార్ ఎల్ శివ కుమార్ మాట్లాడుతూ అక్రమ క్వారీలపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అక్రమంగా క్వారీ నిర్వహించి బ్లాస్టింగ్ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement