Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 12:34 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 12:34 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 12:34 AM
Follow Us

పందెం రాయుళ్ళం … ఏ మాత్రం తగ్గిదేలే…!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జామ్‌జామ్ అంటూ పుంజులను పోటీలకు దించ్చుతాం..!
కోడిపందాలపై ఫోకస్..
GPSతో రంగంలోకి పోలీసులు…

విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్, ఉప్పడి తూర్పుగోదావరి జిల్లా:

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్ (ప్రతాప్): సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది  భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు, బావా మరదళ్ళ సరసాలు. ప్రపంచంలో ఎక్కడెక్కడో నివసిస్తున్నవారు కూడా కుటుంబాలతో సహితం తమ స్వస్థాలాలకు రావడం సర్వ సాధారణం. ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు. సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. అయితే పండగకు ఐదు నెలల ముందు నుంచే కోడి పందాలకు సన్నద్ధం అవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మనది పేద దేసం అని ఎవరూ అనుకోరు. సాటి మానవుడికి పట్టెడన్నం పెట్టలేని వారు కోడి పందాల కోసం లక్షల్లో ఖర్చు పెట్టడం నిజంగా దురదృష్టమే అని చెప్పక తప్పదు.
పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణఇవ్వడం జరుగుతుందని , ఇందుకోసం సుశిఖతలైనవారిని ఎంపిక చేసి, అధిక మొత్తాలు చెల్లించి తీసుకువస్తారని సమాచారం.

ఇక ఏపీలోని పలు జిల్లాలో సంక్రాంతి కోడిపందాలకు షావుకారులు రెడీ అవుతున్నారు. పందెం కోళ్లను ప్రతి రోజు ముగ్గురు సంరక్షించుకుంటారు. పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే.. పందాలపై ఏమేరకు ఆసక్తి చూపుతారో ఇట్టే అర్థమైపోతుంది. వాటికి పాలల్లో నానబెట్టిన బాదం పిస్తా, ఖర్జురా, కిస్‌మిస్‌లను పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు రూ.300 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తారని, శిక్షకులకు ప్రతీరోజు 500-700 వరకు జీత భత్యాల కింద చెల్లించుకుంటారని సమాచారం.

మనకు లభ్యమయ్యే వివిధ కోడి పుంజుల రకాలలో  తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులు ఎంతటి పందెంనైనా నెగ్గే శక్తి ఉంటుందట. ఒక్కో పుంజు ఖర్చు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. పందెలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్ష ఇచ్చి పందెలలో తట్టుకునే విధంగా శిక్షణ ఇస్తారని, పందాలలో పాల్గొనేవారు ఎంట ఖర్చయినా సరే తమ పుంజే గెలవాలన్న ధృఢ సంకల్పంతో ఈ పందాలలో పాల్గొంటారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో కుల, వర్గ, రాజకీయ పార్టీలకు అనుబంధంగా విడిపోయి తీవ్రమైన పందెం మనస్తత్వంతో పాటు వర్గ వైషమ్యాలతో పందాలకు దిగుతారని సమాచారం.

కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఏ మాత్రం తగ్గరు. జామ్‌జామ్ అంటూ పుంజులను పోటీలకు దించుతారు. ఆపైన పందేలు కాస్తారు. సంక్రాంతి వచ్చేస్తుంది.. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. అయితే పోలీసులు దీనిపై దృష్టిపెట్టారు. ముందుగా కోడిపందాల మైదానాలను గుర్తిస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రదేశాల్లో.. మళ్లీ కోడిపందాలకు వేదికగా మార్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మైదానంలో కోడిపందాలను అనుమతించవద్దని ఇప్పటికే భూ యజమానులను హెచ్చరిస్తున్నారు. జూద కార్యకలాపాలు జరిగితే అటువంటి మైదానాలను స్వాధీనం చేసుకుంటామన్నారు.

కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు ఇప్పటికే కోడిపందాలను అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు మైదానాలను గుర్తిస్తున్నారు. కోడి పందాలకు కోసం కత్తుల తయారీదారులు, విక్రయదారులు, గతంలో కోడిపందాల నిర్వాహకులు, గుండాట, కార్డ్ ప్లే, ఇతర జూద ఆటలు నిర్వహించే వారిపై ఫోకస్ చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాల్లో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కోడిపందాలతోపాటుగా ఇతర జూద నిర్వాహకులకు సంబంధించి 180 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో 80 మందిని మండల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు, క్రీడాకారులు, భూమి యజమానులు, కోడి కత్తి తయారీదారులు, అమ్మకందారులు మొదలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అన్ని మైదానాలు, ప్రదేశాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మైదానం లేదా సమీపంలోని ప్రదేశాలలో ఏదైనా కార్యకలాపాలు గమనించినట్లయితే, సమాచారం తక్షణమే పోలీసులకు చేరుతుంది. కోడిపందాలను అరికట్టేందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని పోలీసులు అంటున్నారు. కోడిపందాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి చెప్పారు. ఎవరూ తప్పించుకోలేరు.. పోలీసులు మైదానాన్ని గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కోడిపందాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను వివరించారు. పిఠాపురం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ ఐదు గ్రామాలైన దుర్గాడ, తాటిపర్తి, చెందుర్తి, చిన జగ్గంపేట, కొడవలి గ్రామాల్లో పర్యటించి కోడిపందాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కోడిపందేల నిర్వాహకులకు ఇవ్వొద్దని రైతులకు సూచించారు. మైదానాల సర్వే నంబర్లను సేకరిస్తున్నామని, కోడిపందాల నిర్వాహకులకు భూములు ఇస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంక్రాంతి వచ్చేస్తుంది.. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. అయితే పోలీసులు దీనిపై దృష్టిపెట్టారు. ముందుగా కోడిపందాల మైదానాలను గుర్తిస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రదేశాల్లో.. మళ్లీ కోడిపందాలకు వేదికగా మార్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మైదానంలో కోడిపందాలను అనుమతించవద్దని ఇప్పటికే భూ యజమానులను హెచ్చరిస్తున్నారు. జూద కార్యకలాపాలు జరిగితే అటువంటి మైదానాలను స్వాధీనం చేసుకుంటామన్నారు.

సాంప్రదాయ బద్ధంగా విధ్వంసానికి, హింసకు తావు లేకుండా కోడి పందాలను నిర్వహించుకోవాలని కోర్టులు తెలుపుతున్నా, పలు ప్రాంతాలలో ఈ ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. ముఖ్యంగా భీమవరం, ఉండి, వెంప,తణుకు,దెందులూరు, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాలలో భారీగా కోడి పందాలు నిర్వహించబోతునాట్లు సమాచారం.అయితే ప్రజాప్రతినిధుల సమక్షంలోనే, పోలీసుల కనుసన్నలలోనే ఈ పందాల నిర్వహణ జరుగుతోందని, కంచే చేను మేసిన చందాన ఈ కోడి పందాలపై నిఘా, నియంత్రణలు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.కోడి పందాల నిర్వహణకు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement