విశ్వంవాయిస్ న్యూస్, నల్లపాడు
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల చిన్న పలకలూరు గ్రామంలో వారథి కార్యక్రమాన్ని నిర్వహించిన SI CH. వాసు గారు మాట్లాడుతూ…. ప్రజలు మరియు పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించటమే వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు
మహిళలు మరియు విద్యార్ధులు సామాజిక మాధ్యమాల్లో తమ యొక్క ఫొటోస్ ని పెట్టరాదని అపరిచితుల కు తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వరాదని తెలిపారు ప్రజలు అందరూ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచుకోవాలని, తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ప్రవర్తన గమనిస్తూ వుండాలని గంజాయి వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండేలా చూసుకోవాలని మరియు రోడ్డు యాక్సిడెంట్లు గురించి అవగాహన కల్పిస్తూ వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు.