– బ్యాంక్ ,రిజిస్ట్రేషన్ అధికారులకు పాత్ర ఉంది..
– ఉన్నత అధికారులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ,మమ్ములను ఆదుకోవాలి అని ఆవేదన
విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం
రాజానగరం,విశ్వం వాయిస్ న్యూస్:
రాజానగరం మండలంలో రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు యాంకర్ సుమ చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ – 2 బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజానగరంలో చక్రద్వారబంధం లో చంద్రిక అవంతిక ఫేజ్ 2 ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు.బాధితులు మెండ మృత్యుంజయరావు, నాదెండ్ల వీరభద్రరావు, లక్ష్మి మాట్లాడుతూ 2018లో రామయ్య వేణు లు చంద్రిక అవంతిక ఫ్లాట్ల్ నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. ఒక్కొక్క ప్లాటు 16 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారని అన్నారు. తమ అపార్ట్మెంట్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, కమిటీ హాలు, పార్కు , విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించి ఫ్లాట్ ప్లాట్లు ఇస్తామని, లేదంటే నెలకు పదివేల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు. వీటితోపాటు టీవీలో యాంకర్ సుమ యాడ్స్ తో పాటు పోస్టర్ల రూపంలో కూడా ప్రచారం నిర్వహించారని తెలిపారు. గత ఏడు సంవత్సరాల కాలంగా ప్లాట్లు నిర్మాణానికి లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్ లు, అప్పులు తీసుకొని ఈ.ఎం.ఐ చెల్లిస్తున్నామని తెలిపారు. ఏడు సంవత్సరాల కాలంగా మాకు ఫ్లాట్లు ఇవ్వకపోగా , కట్టిన డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్ సుమ టీవీలో చేసిన ప్రచారం వలె తామంతా మోసపోయామని అయితే ప్రస్తుతం యాంకర్ సుమకు ఈ వ్యవహారంలో సంబంధం లేదని అంటున్నారని తెలిపారు. యాడ్స్ లో ప్రచారం చేసి తమను నమ్మించిన యాంకర్ సుమకు కూడా లీగల్ నోటీసు పంపించామని తెలిపారు. ఫ్లాట్లు కోసం తాము కట్టిన డబ్బు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులకు రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా సంబంధం ఉందని బాధితులు ఆరోపించారు. స్థలంలో నిర్మాణాలు జరగకుండా బ్యాంక్ అధికారులు లోన్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. వీటితోపాటు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సక్రమమైన నిర్మాణాలు జరగకుండానే రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,లు ఆదుకోవాలని కోరారు.ఈ సంఘటనపై రాజానగరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాకీ ఎవెన్యూ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు.