WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పవన్ కళ్యాణ్ చేసిన పనిని సైతం విమర్శించడమేమిటి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తిరుమల లడ్డూకు అపచారంపై తీవ్రంగా స్పందించిన డా. సత్యభామ రాయవరపు..
కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాడ్లాడ్డమా..

విశ్వంవాయిస్ న్యూస్, సర్పవరం

కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:సనాతన ధర్మం అంటే ఏమిటో, దాని విలువలేమిటో తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం శోచనీయమని రాయవరపు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మహిళా సంఘం అధ్యక్షురాలు,కళావేదిక అధినేత డా సత్యభామ రాయవరపు అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందిస్తూ, ఇంటనీఛానికి ఒడిగట్టిన వ్యవహారాన్ని వెలికితీస్తే,విమర్శలు గుప్పించడమేమిటని నిలదీశారు. లడ్డూకి గల పవిత్రత దెబ్బతీసి, అపచారం చేయడం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఆలయమెట్లు కడిగితే కూడా విమర్శించడమేనా అని ఆమె ప్రశ్నించారు. అసలు ఈదేశంలో పుట్టి సనాతన ధర్మం గురించి ఇష్టారీతిలో మాట్లాడ్డానికి నోరెలా వస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడానికి ఎంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే రాజకీయాలు చేయడం, ఇష్టం వచ్చినట్లు గెంతడం, నోరు పారేసుకోవడం తగునా అని డా సత్యభామ ప్రశించారు. ఎవరెన్ని మాటలు మాట్లాడుతున్నా అలు పెరుగని పోరాటం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యదక్షత అమోఘమని ఆమె ప్రశంసించారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టమని అడుగుతుంటే,ఓట్లు ఆడుగుతున్నట్లు గా రాజకీయం చేయడంలో అర్ధం ఏమిటని ఆమె ప్రశ్నించారు.పవన్ చేస్తున్న పోరాటం ఎవరికోసం. మనదైన సనాతన ధర్మం కోసమే కదా. ఆయన చేసే పోరాటం ఆయన ఇంటికోసమో, ఒంటికోసమో కాదు కదా.మనకోసమే కదా. అయినా ఇంకా విమర్శలేమిటి,పక్క వాడి గురించి ఆలోచించలేని ఈరోజుల్లో అన్ని మతాల పట్ల సమభావం ఉండాలని,సౌబ్రాత్రుత్వం ఉండాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడితే తప్పు బట్టడం దారుణం.తప్పు జరిగింది కనుక పోరాడుతున్నారని గ్రహించకుండా విమర్శిస్తూ పొతే ఎలా అని డా సత్యభామ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి పవిత్రతకు విఘాతం కల్గి, లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన ఘోర అపచారానికి ఆ నారాయణుడే, ఆ వెంకటేశ్వరస్వామే స్పందించి పవన్ కళ్యాణ్ రూపంలో గళం విన్పిస్తున్నట్లుగా ఉందని ఆమె అభివర్ణించారు.పవన్ కళ్యాణ్ ఆవేదన అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడేస్తే పోతుందని అనుకోవడం పొరపాటేననని డా.సత్యభామ అన్నారు. భగవంతుడి ముందు గుప్పిగంతులు వేస్తే ఆటలు సాగబోవని గ్రహించాలన్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మనమంతా బాసటగా నిలవాలన్నారు.ప్రతి మహిళ కూడా సనాతన ధర్మ రక్షణ కోసం నడుంకట్టుకుని నిలబడాలని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement