– టెస్టింగ్ సాల్ట్స్ లేకుండా రుచికరమైన వంటలు..
– హోటల్ జగదీశ్వరి ఆవరణలో కనకాల రాజా నూతన వ్యాపారానికి శ్రీకారం
విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
ఇప్పటి వరకు ఫ్రూట్ జ్యూస్ వ్యాపారంలో ఆరితేరిన ఛాంబర్ బిల్డింగ్ ట్రస్ట్ మాజీ కార్యదర్శి కనకాల రాజా ఇప్పుడు ‘కె.ఆర్ బిర్యానీ’ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.కె ఆర్ ఫ్రూట్ జ్యూస్ పేరుతొ కోటిపల్లి బస్టాండ్ లో వ్యాపారం సాగిస్తుండగా, తాజాగా రావులపాలెం లో కూడా ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం మొదలు పెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నా రు. స్థానిక పాత మేడూరి హోటల్, ప్రస్తుతం హోటల్ జగదీశ్వరి ఆవరణలో ‘కె ఆర్ బిర్యానీ’నూతన వ్యాపారాన్ని ఈనెల 23వ తేదీ బుధవారం ఉదయం ప్రారంభిస్తున్నారు.చికెన్ పీస్ బిర్యానీ, ధమ్ బిర్యానీ,మటన్ బిర్యానీ,ఫ్రాన్స్ ప్రై బిర్యానీ, కొబ్బరి అన్నం కోడికూర, నాన్ వెజ్ మీల్స్,నాన్ వెజ్ కర్రీస్ లభిస్తాయని కనకాల రాజా చెప్పారు.వివాహాది శుభకార్యాలకు వెజ్ నాన్ వెజ్ ఆర్దర్లపై కేటరింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు.మా ఈ నూతన వ్యాపార ప్రారంభోత్సవ సందర్బంగా ఖాతాదారులు,శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు విచ్చేసి,మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. అందరికీ ఇదే ఆహ్వానమని స్వాగతించారు.