విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:కె.ఆర్ ఫ్రూట్ జ్యూస్ పేరుతో కోటిపల్లి బస్టాండ్ లో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం లో ఆరితేరిన ఛాంబర్ బిల్డింగ్ ట్రస్ట్ మాజీ కార్యదర్శి కనకాల రాజా తాజాగా ‘కె ఆర్ బిర్యానీ’ పేరుతో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.స్థానిక పాత మేడూరి హోటల్, ప్రస్తుతం హోటల్ జగదీశ్వరి ఆవరణలో ‘కె ఆర్ బిర్యానీ’ ని బుధవారం ఉదయం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించారు. కిచెన్ విభాగాన్ని పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, క్యాష్ కౌంటర్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ,ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, లక్ష్మీనారాయణ జవ్వార్,కొల్లేపల్లి శేషయ్య,బూర్లగడ్డ వెంకట సుబ్బ రాయడు,నందెపు శ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు,మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, మాజీ ఫ్లోర్ లీడరు వర్రే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్స్ కురగంటి సతీష్, నీలపాల తమ్మారావు,శివశంకర్ చిట్స్ మేనేజర్ చీకట్ల సత్యనారాయణ, ఛాంబర్ బిల్డింగ్ ట్రస్ట్ కార్యదర్శి పచ్చిగోళ్ళ సురేష్ కుమార్, కూర్మదాసు ప్రభాకర్,రామినీడి మురళీమోహన్, చలుమూరు శ్రీనివాస్,అల్లూరి శేషునారాయణ రావు,వంటెద్దు సూరిబాబు,రెడ్డి మణి, పెంకె సురేష్ కుమార్,బాసా భాస్కర రెడ్డి,మద్దాల రవిశంకర్,రోజ్ మిల్క్ రాము,పనసయ్య,నిమ్మలపూడి గోవింద్,కొత్తపేట రాజా,వై శ్రీనివాస్,సిటీఆర్ ఐ బాచి,ఆకుల బాలు,వలవల చిన్ని, చాపల రాజు, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, మిత్రులు,శ్రేయోభిలాషులు విచ్చేసి, వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ,శుభాకాంక్షలు తెలిపారు. అతిధులకు ‘కె ఆర్ బిర్యానీ’ అధినేత కనకాల రాజా,కనకాల అజయ్ స్వాగతం పలికారు.
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ,ధమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ, స్పెషల్ మటన్ బిర్యానీ (బోన్ లెస్), స్పెషల్ ఐటెంగా కొబ్బరి అన్నం కోడికూర,నాన్ వెజ్ మీల్స్, నాన్ వెజ్ కర్రీస్,లభిస్తాయని, పార్సిల్స్ సదుపాయం కూడా ఉందని కనకాల రాజా,కనకాల అజయ్ తెలిపారు.మా ఈ నూతన వ్యాపార ప్రారంభోత్సవ సందర్బంగా ప్రజా ప్రతినిధులు, ఛాంబర్ ప్రముఖులు,వివిధ రంగాల ప్రముఖులు,ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు విచ్చేసి,మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.