విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెరుకూరి గార్డెన్స్ లో కార్తీక వనసమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్ అధ్యక్షత వహించగా నగర ప్రధాన కార్యదర్శి కాలేపు సత్యనారాయణ మూర్తి స్వాగతం శివపార్వతులకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఆటపాటలతో దేవాంగ సంఘీయులు పిల్లలు, పెద్దలు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. సుమారు పన్నెండు వేల మంది సంఘీయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్ మాట్లాడుతూ శివుని తేజస్సు తో ఉద్భవించిన దేవాంగులు పవిత్ర కార్తీక మాసంలో ఈ వనసమారాధన ద్వారా కలిసి ఐక్యతను చాటడం శుభసూచికమని అన్నారు. నగర అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలు గా దేవాంగ సంఘీయులు ప్రతీ సంవత్సరం కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని,దేవాంగుల అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ,సంఘ పెద్దలు శ్రీయుతులు కేకే సంజీవరావు, గంపా సోమలింగేశ్వరరావు (బాబు)ద్వారా పార్వతి సుందరి, చింతా చలపతి, బీరా శ్యామల రావు,బత్తుల రాజేశ్వరరావు, బళ్ళా సత్యనారాయణ,బళ్ళా సత్తిబాబు,కాలేపు బాబి,ఆశపు మల్లిబాబు,బళ్ళా సత్యవతి, పూర్ణిమ ప్రసాద్, పిచ్చిక అనిల్, అల్లక సాంభ,బళ్ళా శ్రీనివాస్, నల్లా శంకరరావు,చప్పటి జయలక్ష్మి,బొమ్మన గౌరి తదితరులు పాల్గొన్నారు.