విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టి.కే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు కలిసి కేరళ రాష్ట్రం వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ నాలుగు లక్షల పదివేలు పైచిలుకు అత్యధిక ఓట్ల మెజారిటీతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక రాజమండ్రి క్వారీమార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విజయోత్సవం వద్ద క్వారీ మార్కెట్ ప్రాంత ప్రజలతో స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగాసెంటర్ లో ఉన్న అంబేద్కర్,పూలే,బత్తిన సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగరవేసిందని తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడబోతుందని,అలాగే వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంటులో మొట్ట మొదటి సారిగా అడుగుపెడుతున్న శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశ బడుగు, బలహీన వర్గాలు ప్రజల, నిరుద్యోగులు, భారతదేశ యువత సమస్యలపై ఆమె లోక్ సభలో తన వానిని గట్టిగా వినిపించి వారి సమస్యల పరిష్కారానికి దోహదపడతారని, 2029లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారని అన్నారు. దేశంలోనూ,మిగతా రాష్ట్రల లోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ప్రియాంక గాంధీకి ఉందని బలంగా నమ్ముతున్నానని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, హరిబాబు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబి, దెయ్యాల రాజు,తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.