విశ్వంవాయిస్ న్యూస్, vishaka
సైఫ్ అలీఖాన్ , దీపీకా పదుకొణే నటించిన `కాక్ టైల్` పదేళ్ల క్రితం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్-రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్ ఆధారంగా హోమ్ అదజానీయా తెరకెక్కించిన చిత్రమిది. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా 125 కోట్ల వసూళ్లను సాధించింది. మ్యూజికల్ గానూ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. సైఫ్ అలీఖాన్ పాత్రలో షాహిద్ కపూర్ ని పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం మేకర్స్ షాహిద్ తో చర్చలు జరుపుతున్నారు. దాదాపు షాహిద్ ఎంట్రీ ఖరారైనట్లే సమాచారం. దినేష్ విజయ్ నిర్మిస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ గా దీపికను కొనసాగిస్తారా? కొత్త భామకు ఛాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి. అలాగే కాక్ టైల్ లో డైనా పెంటీ, డింపుల్ కపాడియా, బోమన్ ఇరానీ, రణదీప్ హూడా ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి వీళ్లందర్నీ కాక్ టైల్ -2లో కొనసాగిస్తారా? లేదా? అన్నది చూడాలి.అయితే ఈ సీక్వెల్ లో చాలా మంది కొత్త నటీనటులు యాడ్ అవుతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. స్టోరీ డిమాండ్ మేరకు పేరున్న నటుల్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే హీరోయిన్ పాత్రలో దీపిక నటించే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. కాక్ టైల్ రిలీ జ్ అయి 12 ఏళ్లు అవుతుంది. అప్పుడు ఆ వయసులో దీపిక ఆ పాత్రకి పర్పెక్ట్ గా సూట్ అయింది. సైఫ్ అలీఖాన్ కూడా మ్యాచ్ అయ్యాడు. కానీ ఇప్పుడదే కాన్సెప్ట్ కి మ్యాచ్ అవ్వడం కష్టం. అందుకే సైఫ్ ముందుగానే వైదొలిగినట్లు తెలుస్తోంది. దీపిక స్థానంలో మరో యువ నాయిక వచ్చే అవకాశం ఉంది. సీక్వెల్ కాబట్టి కాన్సెప్ట్ నేటి జనరేషన్ కి కనెక్ట్ అవ్వాలి. అంటే మెయిన్ లీడ్స్ కూడా మారాలి. యూత్ లో ఫాలో యింగ్ ఉన్న హీరో, హీరోయిన్లు అయితే బ్యాలెన్స్ అవుతారు. షాహిద్ కపూర్ ఆ పాత్రకి అన్ని రకాలుగా అర్హుడే. `కబీర్ సింగ్` యూత్ లో అతడి క్రేజ్ రెట్టింపు అయిన సంగతి తెలిసిందే.