విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్:
ఎస్సీవర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జన విజయవంతం చేయాలని మాల మహానాడు స్టేట్ సెక్రెటరీ గారా అప్పారావు,ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ఉల్లం రవి పిలుపునిచ్చారు.గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఉల్లం రవి మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణపై కేంద్ర ప్రభుత్యం ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గతంలో సుప్రీం కోర్టు కూడా వర్గీకరణ చెల్లదని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.వర్గీకరణకు రాజ్యాంగం ప్రకారం చట్టబద్దత లేదని ఉల్లం రవి అన్నారు. దీనివల్ల మాలలకు నష్టం జరుగుతుందని అందుకే గుంటూరులో ఈనెల 15 న మాలల మహాగర్జన సభ నిర్వహించి సత్తా చాటుతామని చెప్పారు.వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఉల్లం రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ నాయకులు కరూపోతు అచ్చుబాబు,వల్లూరు రాజేష్, బెల్లాన భాస్కర్,గాలి రాధాకృష్ణ, నేతల కిషోర్, పిల్లి వినోద్, ఉత్తరవిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.