విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్, తాళ్ళరేవు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని పి మల్లవరం గ్రామపంచాయతీ పరిధి పత్తి గొంది గ్రామంలో హైదరాబాద్ వారి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన చేశారు. ఈనాటిక ప్రదర్శనలో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేస్తూ, ఆయన మన దేశానికి రాజ్యాంగాన్ని రచించే స్థాయి వరకు ఎదిగారని తెలియజేశారు. కటిక పేదరిక కుటుంబంలో జన్మించిన పేదరికం ని జయించి ఉన్నత విద్యనభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారని, ప్రజలందరికీ సమానమైన హక్కులను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించారని సాంస్కృతిక నాటకంలో ప్రజలకు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి తెలియజేశారు. ఈ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికలు తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పి.మల్లవరం , గ్రాంటు , పత్తి గొంది గ్రామాలు నుండి ప్రజలు వచ్చి ఈనాటి తిలకించారు. మండలంలోని దళిత సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.