కాకినాడ రూరల్ ఎక్సైజ్ ఎస్ఐ ఆధ్వర్యంలో మెరుపుదాడులు
విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ రూరల్
కాకినాడ రూరల్ , విశ్వం వాయిస్ న్యూస్ :
కాకినాడ రూరల్ మండల పరిధిలోని రమణయ్యపేట గ్రామపంచాయతీ పరిధి కొత్తూరు గ్రామానికి చెందిన పోలవరపు శ్రీను(41) సంవత్సరాల వయసు గల వ్యక్తి గ్రామంలో నాటు సారాయి అమ్ముతున్న సమాచారంతో కాకినాడ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ ఎం వి వి బి కుమార్ తన సిబ్బందితో కలిసి సారాయి అమ్ముతున్న వ్యక్తిని ఐదు లీటర్ల సారా తో పట్టుకున్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు , ఈ దాడులలో కాకినాడ రూరల్ ఎక్సైజ్ ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నట్లు కాకినాడ సిఐ కె రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు.