విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: అసని తుఫాన్” నేపథ్యంలో రానున్న రెండు రోజుల లో ఆంధ్రా కోస్తా జిల్లాలలో ఒక మోస్తరు నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి “అసని తుఫాన్” నేపథ్యంలో తాడేపల్లి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా, కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అసని తుఫాన్ వలన ఒక మోస్తరు నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు వారి వారి జిల్లాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావం అంతగా చూపక పోవచ్చునని పేర్కొన్నారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా లలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు ముందస్తు చర్యలతో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సిద్దంగా ఉండాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా. మాధవీలత వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకి సూచనలు చేస్తూ, తుఫాను ప్రభావం లేక పోయినా వర్ష సూచనలు ఉన్నందున క్షేత్ర స్థాయిలో రైతులు కోత కోసిన పంటను వానకి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఒక వేళ పంటకోత అవ్వకపోతే వర్ష సూచన తగ్గిన తర్వాత కోత పనులు చేపట్టాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగి, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఆర్ఎమ్సి కమిషనర్ కె.దినేష్కుమార్, డిఆర్ఓ బి. సుబ్బారావు, డిఎంఅండ్హెచ్ఓ డా. ఆర్.స్వర్ణలత, డిసిహేచ్ఎస్ డా.ఎమ్.సనత్కుమారి, డిసిఎఫ్ఓ సిహెచ్.పి.లుధర్ కింగ్ , విద్యుత్శాఖ ఈఈ ఎన్.శ్యాముల్, సీపీఓ పి. రాము, డిపివో సత్యనారాయణ, డ్వామా పిడి పి. జగదాంబ, ఇతర శాఖల అధికారులు పాల్గన్నారు.