Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 19, 2024 6:43 AM

ACTIVE

India
44,499,261
Total active cases
Updated on March 19, 2024 6:43 AM

DEATHS

India
533,523
Total deaths
Updated on March 19, 2024 6:43 AM
Follow Us

ఎట్టకేలకు ద్వారపూడి మండపేట రోడ్డు పనులకు మోక్షం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ద్వారపూడి – మండపేట రోడ్డు పనులకు మోక్షం లభించింది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదివారం శంఖు స్థాపన నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో లో ఎమ్మెల్సీ త్రిమూర్తులు పాల్గొని మాట్లాడారు. గత 10సంవత్సరాల కాలంగా ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇటీవల వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతిందన్నారు. ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు విశాఖపట్నంకు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందన్నారు. త్వరలోనే ఈ రోడ్డు ను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామన్నారు. ఆషాఢ మాసం వచ్చేస్తుండటంతో ప్రస్తుతం తాము శంఖు స్థాపన పనులు మొదలు పెట్టడం జరిగిందని, త్వరలోనే మంత్రి తో మరో కార్యక్రమం ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడేళ్లు మాత్రమే కావస్తుందని, అయితే అంతకు ముందే ఎమ్మెల్యే గా వున్న వేగుళ్ళ ఈ రోడ్డు ను అభివృద్ధి చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. వేములపల్లి లో ఇప్పటికే విద్యుత్ ఇవ్వడానికి తాము చర్యలు తీసుకుంటే అక్కడి ప్రజలకు అన్యాయం చేసే విధంగా వేగుళ్ళ ధర్నాకు ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ పనులు పూర్తయితే వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో వేగుళ్ళ ఇదంతా చేస్తున్నారని మండి పడ్డారు. ఎమ్మెల్యే కలగజేసుకుంటే తాను ఆ పనిని ఆపెస్తానని అనుకుంటున్నారని, అయితే తాను ఎమ్మెల్యే తో రాజకీయంగా చూసుకోవాల్సినవి చూసుకుంటాను తప్పితే ప్రజలకు మాత్రం నష్టం కలిగించే పనులు ఏమీ చేయ్యనని పేర్కొన్నారు. వర్షాలు పడే సమయంలో పనులు ప్రారంభించడం పై కొన్ని విమర్శలు వస్తున్నాయని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవన్నీ సిగ్గు లేని వారు మాట్లాడే మాటలని కొట్టిపారేశారు. వర్షాలు వచ్చినప్పటికీ సాధ్యమైనంత త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ప్రతి పక్ష పార్టీల నాయకులు కావాలనే రాద్దాంతం చేశారన్నారు. ఈ నియోజకవర్గం లో ఓ అతి పెద్ద నాయకుడు వున్నాడని, ఆయన పేరు చెప్పే స్థాయి తనకి లేదని ఆయన మాత్రం మామ్మూళ్లు కోసమే ఈ రోడ్డు ఆగిపోయినట్టు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆయన స్వభావం ఇలాంటిది కాబట్టే అలాంటి ఆలోచనలు ఆయనకు వస్తున్నాయన్నారు. అలాగే వెలగతోడు లో తాము 200మందికి పట్టాలిస్తే దానిపై ఎమ్మెల్యే వేగుళ్ల విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. తన హయాంలో సెంటు భూమి అయినా పెదాలకు ఇచ్చిన సందర్భం వుందా అని ప్రశ్నించారు. వేములపల్లి ఇందిరమ్మ కాలనీకి కృష్ణార్జున చౌదరి ఎమ్మెల్యే గా వుండగా వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలివ్వడం జరిగిందన్నారు. అక్కడ చేసిందంతా వైఎస్ అయితే 2018 లో చంద్రబాబు నాయుడు పట్టాలిచ్చి ఇళ్ళు నిర్మించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్ హయాంలో పట్టాలిస్థే ప్రస్తుత గవర్నమెంట్ హయాంలో నే 1300 మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. అభూత కల్పనలు తప్పా ఇందులో తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అలాగే కేంద్రం జోక్యంతో నే వెలగతొడులో పట్టాలు తిరిగి ఇచ్చారని వేగుళ్ల అంటున్నారని, ఆయనకు చెయ్యడానికి ఏమీ లేక ఏదేదో మాట్లాడుతూ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ జోక్యం తోనే పట్టాలు ఇచ్చి వుంటే విద్యుత్, రోడ్డు పనులను సైతం కేంద్రం తో మాట్లాడి ఎందుకు చేయంచలేదంటు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రీ పాపారాయుడు, ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, పోతంశేట్టి ప్రసాద్, సీతిన సూరిబాబు, ఇప్పనపాడు గ్రామ సర్పంచ్ కుంచే వీరమణి ప్రసాద్, విద్యా దాత పోలిశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement