Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 5:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 5:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 5:36 AM
Follow Us

ఇసుక మాఫియా కాదు సంక్షేమం””మట్టి మాఫియా కాదు అభివృద్ధి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట, విశ్వం వాయిస్ న్యూస్:

రాష్ట్రంలో కేవలం వైఎస్సార్సీపీ వల్లే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సి ఎం జగన్మోహన్ రెడ్డి కే సంక్షేమ పథకాలు అమలు సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం  మండపేట మండలం తాపేశ్వరం అతిథి ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు  అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపి చింతా అనురాధ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీ అనూరాధ మాట్లాడుతూ మహిళా సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుని వెళ్ళాలన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమలను సామాజిక మద్యమల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. పిల్లి బోస్ మాట్లాడుతూ గతంలో 20 ఏళ్ళ బాటు బీసీ లు టీడీపీ కి అండగా ఉంటే చంద్రబాబు వారిని దగా చేసారని ఆరోపించారు. 2019 లో బీసీ లు జగన్ కు మద్దతు ఇవ్వగా బీసీ ల కోసం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 35 లక్షల మంది కి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. సంక్షేమం లో దాదాపు రూ 1.10 లక్షల కోట్లు కేవలం రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. ఏడాది లేదా రెండేళ్ల లో వచ్చే ఎన్నికల కు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమలు వివరించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ  రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పాగా వేసేలా కార్యకర్తలు శ్రమించాలని కోరారు. ఇక్కడి సభ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడం ఎంతో ఉత్సాహాన్ని నింపిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపారు. మండపేట నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఏడిద సర్పంచ్ బురిగా ఆశీర్వాదం, నక్కా సింహాచలం, కుడుపుడి రాంబాబు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి,  వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు,చెల్లుబోయిన శ్రీనివాస్,కుడుపూడి భవాని, రెడ్డి రాధాకృష్ణ, పిల్లి చినబాబు,ఉండమట్ల వాసు,వేగుళ్ళ నారయ్య బాబు,కొమ్ము రాంబాబు,పెంకె గంగాధర్,పలివెల సుధాకర్, ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, సయ్యద్ రబ్బాని , పలివేల సుధాకర్ ,పోతంశెట్టి ప్రసాద్ , సత్తి రాంబాబు, సాధనాల శివ భగవాన్ , మందపల్లి రవి కుమార్ , సలాది వీరబాబు, గారపాటి అశోక్ , రాయవరం ఎం పి పి నౌడు వెంకటరమణ, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు,

మున్సిపల్ కౌన్సిలర్స్, జిల్లా పరిషత్తు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీల చైర్మన్లు డైరెక్టర్లు , దేవస్థానం చైర్మన్లు , ధర్మకర్తలు వైసీపీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!