Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 4:59 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 4:59 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 4:59 AM
Follow Us

ఎటపాకలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ
– ఎటపాక జెడ్పీటిసి సుస్మిత , ఎంఈఓ బాలరాజు చేతుల మీదుగా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

మండల కేంద్రంలోని కెజిబివి బాలికల పాఠశాల , గుండాల కాలనీలోని (పినపల్లి) జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను మంగళవారం ఎటపాక జెడ్పీటిసి ఉబ్బా సుస్మిత , మండల విద్యాశాఖాధికారి నీలి బాలరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటిసి ఉబ్బా సుస్మిత , మండల విద్యాశాఖాధికారి నీలి బాలరాజు మాట్లాడుతూ కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన మొదటి రోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారని ఎంఈఓ బాలరాజు తెలిపారు. విద్యాకానుక వస్తువుల నాణ్యతలో రాజీలేకుండా పంపిణీ చేయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ,ఆయా యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లిపాక ఎంపిటిసి బూరం అంజలి , సర్పంచ్ గుండి సీతా మహాలక్ష్మి , ఉప సర్పంచ్ తోట శశికుమార్, కేజీబివి ఎస్వో రమాదేవి , ప్రధానోపాధ్యాయులు పుల్లయ్య , వైకాపా నాయకులు గుండి రాము , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement