విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:
కొత్తపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి
గోదావరి ముంపు ప్రభావిత గ్రామాలలో ఉద్యాన పంటలైన అరటి కంద, బొప్పాయి మరియు మిరప, కూరగాయల సాగు, వరి నారుమల్లు ముంపు బారిన పడి రైతాంగానికి నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మండల పరిధిలోని వానపల్లి గ్రామంలో అధికారులు రైతులతో కలిసి పర్యటించి దెబ్బతిన్న మిరప, అరటి కందా పంటల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేతికి అంది వచ్చే స్థాయిలో పంటలు నష్టపోవడం చాలా బాధాకరమని, కోనసీమ రైతాంగం నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వచ్చేలా అన్ని చర్యలు చేపడతామని రైతులకు భరోసానిచ్చారు. రైతాంగం ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే పరమావధిగా వ్యవసాయ అభివృద్దే రాష్ట్ర పురోగాభివృద్దిగా భావించి, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టాలను ఎప్పటికప్పుడు సకాలంలో అందించే ప్రక్రియ ఆనవాయితీగా చేపడుతూ రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ఆ దిశగానే పంట నష్టాలు వస్తాయని ఆయన రైతాంగానికి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వరద ఏ స్థాయిలో వచ్చిందీ, ఎన్ని రోజులు పంటలు వరద నీటిలో మునిగి ఉండడం వల్ల పంట నష్టాలు సంభవించాయన్న వివరాలను ఆయన రైతాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ ఉద్యాన పంట నష్ట బృందాలు పంటల నష్టాల అంచనాలను రూపొందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ రెవెన్యూ శాఖ, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి అధికారులు రైతాంగం తదితరులు పాల్గొన్నారు.