విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడనగర ప్రాంత రాజీవ్ గృహకల్పల్లో లీకేజీల కారణంగా 70% శాతం ప్లాట్లలో నివాస యోగ్యత కరువయ్యిందని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మూడు అంతస్తుల అపార్ట్ మెంట్ పై మెట్ల పిల్లర్ల పై నిర్మించిన వాటర్ ట్యాంకర్లు చాలా చోట్ల అధిక సంఖ్యలో శిధిల కావడం వలన కూలి పోయే ప్రమాదం ఏర్పడితే దిగువ ప్లాట్ల వరకు ఈ దుస్తితి ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. మేజర్ రిపేర్లు లేకపోవడం వలన గోడలు చెమ్మగిల్లి పెచ్చులూడిపోతున్న దుస్తితిలో పేద ప్రజలు జీవిస్తున్న దుస్తితి వుందన్నారు. పైపు లైన్లు పగిలిపోవడం మురుగు గొట్టాలు చిధ్రం కావడం వలన అపారిశుద్ధ్యంతో అనారోగ్యాలు ప్రబలే ప్రమాదముందన్నారు. నివాస యోగ్యతా నగరాల్లో 4 స్థానానికి చేరిందని స్మార్ట్ సిటీ వార్షికోత్సవాలు చేస్తున్న ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి నగరంలోని రాజీవ్ గృహ కల్పల లీకేజీల పై వాస్తవ నివేదికలు ప్రభుత్వం ముందుంచి మేజర్ రిపేర్లు చేయించాలని కోరారు. పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు శుక్రవారం సాయంత్రం గృహకల్ప ప్రాంతాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకుని పాత్రికే యులకు వివరాలను వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగిరమేష్ కు వినతి పత్రాన్ని పంపించారు.