– సిఎం సహాయ నిధి నుంచి రూ.3.50 లక్షలు మంజూరు
– రూ. 50 వేల ఆర్థిక సాయం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్న హస్తం అందించి సకాలంలో సరైన వైద్యం అందేలా కృషి చేసారు ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. ఆలమూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఎరుకొండ గణేష్ భార్య దుర్గ కొంత కాలంగా తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. చాలా ఆసుపత్రులు తిరిగినప్పటికి సరైన వైద్యం అందలేదు. చివరికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్థారించారు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్సతో పాటు వైద్యానికి లక్షలాది రూపాయలు అవసరమని వైద్యులు తెలపడంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గణేష్ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారు రూ.3.5లక్షలు ఆర్ధిక సహాయాన్ని అందేలా కృషి చేసారు. దీంతో ఇటీవల వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. ఆపరేషన్ అనంతరం కొత్తపేట తహశీల్దార్ కార్యాలయం వీధిలో పుట్టింటిలో విశ్రాంతి తీసుకుంటున్న దుర్గను ఎమ్మెల్యే పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేసారు. అధైర్యపడవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా ప్రభాకర రావు కూడా రూ.10 వేలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జెడ్పిటిసి గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్, కొత్తపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెరవలి వెంకటేశ్వరరావు, రావులపాలెం మండల రజక సంఘం అధ్యక్షుడు చాగంటి సత్యనారాయణ, కోశాధికారి మల్లేశ్వరపు పరమేశ్వర రావు, మాగాపు ముత్యాలరావు, కొత్తపేట మండలం రజక సంఘం అధ్యక్షుడు అవిడి సూర్య చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.