Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 2:58 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 2:58 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 2:58 PM
Follow Us

సీఎం సారు మీకు కాపులు అంటే అంత లోకువా???

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సీఎం గారు మీకు కాపులు అంటే అంత లోకువా…
హోల్ సెల్ గా అమ్ముడు పోతారంటు అవమానిస్తారా…
వైసీపీ భూ స్థాపితం అయ్యేరోజులు దగ్గర పడ్డాయ్..

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

కాపుల్ని అడ్డంగా మోసం చేసిన పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాడు వైఎస్ నేడు జగన్ కాపులకు రిజర్వేషన్ రాజ్యాధికారం దక్కకుండా కుట్రలు పన్నుతూ నిలువెల్లా మోసం చేశారన్నారు  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ప్రారంభించడానికి కాకినాడ ప్రాంతంలోని గొల్లప్రోలుకు వచ్చి కాపుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించారని బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు అన్నారు.వైసీపీ అధినేత.సీఎం జగన్ రెడ్డి కాపులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారే తప్ప మా సామజిక వర్గానికి చేసిన మేలిమి లేదన్నారు మండలం పరిధిలోని ఈతకోటలో శనివారం నాడు ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డిని నేరుగా అడగడలచుకున్నాను గోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా ఎందుకు కాపుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని గండ్రోతు ప్రశ్నించారు. కాపులు ఓట్లు అమ్ముకునే వారని వ్యాఖ్యానించారని దీనికి త్రీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,ప్రస్తుత ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు కాపుల ఓట్లతో గెలవలేదా అని అన్నారు.నాడు స్వర్గీయ వైఎస్సార్ దగా చేస్తే నేడు జగన్ రెడ్డి మోసం చేశారని గత ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయన్నారు 

వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్నారు ఎక్కడా కనిపించడం లేదన్నారు.ముఖ్యమంత్రి ఆస్తులు తాకట్టు పెట్టి నిధులు తెచ్చి పధకాలను నిర్వహిస్తు రాష్టాన్ని అధోగతి పాలు చేస్తూ అభివృద్ధిని చీకట్లోకి నెట్టేశారన్నారు 

.కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు.పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా ప్రజా ప్రతినిధిగా కాపులకు చేసిన న్యాయం ఏంటని ప్రశ్నించారు మీ ముఖ్యమంత్రి కాపులు అమ్ముడుపోతున్నారని చెబుతుంటే కాపు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చెయ్యాల్సింది పోయి సభలపై చప్పట్లు కొడుతూ కూర్చుంటున్నారాని వీర గోవిందరావు మండిపడ్డారు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చెబుతున్న అంకెలకు చాలా తేడా ఉందని దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతీ సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలను ఇచ్చి ఐదు సంవత్సరాలకు పది వేల కోట్లను కేటాయిస్తామని చెప్పిన మీరు గడిచిన మూడు సంవత్సరాలు పాలనలో కాపుల అభ్యున్నతికి ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యోన్నతి పధకానికి ఇతరత్ర రుణాలకు ఎంత ఇచ్చారో శ్వేతప్రతం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు అన్ని సంక్షేమ పధకాలను కలుపుకుంటూ అని కోట్లు ఇన్ని కోట్ల ఇచ్చామని చెప్పడం సరికాదన్నారు 

పరామర్శనలో సానుభూతి చూపాల్సింది పోయి పళ్ళు ఇకిలిస్తున్న నవ్వతున్న బటన్ రెడ్డి నైజం గురించి ప్రజలంతా గ్రహిస్తున్నారన్నారు కులాలు వారీగా విడదీసి ఓట్లు దండుకుని మళ్ళీ గద్దెనెక్కి రాజ్యమేలాదామని చూస్తున్నావా జగన్ నీకు ఓటమి ఎదురయ్యే పరిస్థితులను నువ్వే ఏర్పడుచుకుంటున్నావ్ 

 ప్రజల కష్టాలు పట్టవా అని ఆయన అన్నారు గోదావరి వరదలు కారణంగా ఇబ్బందులతో కష్టాలు పడుతున్న వరద బాధితులకు సాయం చేసి న్యాయం చేయమని వినతిపత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారన్నారు అక్క చెల్లమ్మలకు అంతా చేసాను ఇంత చేస్తున్నాను అని గొప్పలు చెప్పే జగనన్న వీర మహిళలపై ప్రజాప్రతినిధులు అసభ్య పదజాలంతో అవమాన పరిచి మాట్లాడంటం దారుణమని ఎందుకు ఖండించి చర్యలు తీసుకోలేదన్నారు 

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్న మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి సీఎం, నాయకులు సరిపోరన్నారు ఓట్ల కోసం అధికారం దాహం కోసం కులాల మధ్య ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు రేపుతోందన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా నాటి నుండి అభివృద్ధి శూన్యమని ఏ సామజిక వర్గం ప్రజలు కూడా తమ పాలనలో సంతృప్తిగా లేరని రాష్టంలో అంతా గందరగోళంగానే ఉందన్నారు కాపు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ 

ఆగస్టు పదిహేనుకు డెడ్ లైన్ పెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రశ్నించే పరిస్థితి దాటిందని,ఇకపై గట్టిగా పోరాడతామన్నారు.వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు.ఈ కార్యక్రమంలో గండ్రోతు వీరన్నకాపు,సలాది ప్రకాష్, గండ్రోతు గౌతమ్, యర్రంశెట్టి నాని, తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement