విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
దేశంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. దేశ జనాభాలో 85 శాతం మందిని దారిద్ర రేకకు దిగువనున్న వారిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అందులో 50 శాతం మందికి రేషన్ కార్డులు దారులకు ఆహార భద్రత ఇవ్వడం జరిగింది. మిగిలిన 35% మందికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉంది. రాష్ట్రంలో 1.45 కోట్లు తెల్ల రేషన్ కార్డులు ఉండగా, కేంద్రం 89, 35, 626 కార్డులను ఎన్ ఎఫ్ ఎస్ ఏ కార్డులు జాబితాలో చేర్చింది. మిగిలిన 56 లక్షల కార్డుదారుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలోనే ఉచిత బియ్యం అందించింది. ఉచిత బియ్యం పంపిణీకి కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయడంతో కేంద్రం ఒత్తిడి తెచ్చి ఆగస్టు నెల నుండి పంపిణీ చేయాలని కోరింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాబితాలను మార్చి బియ్యం మిగులుచుకునేలా ప్రణాళిక రూపొందించి పలువురికి మొండి చేయి చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయంతో పాటు మిగిలిన వారికి తక్షణమే ఉచిత బియ్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పౌర సరఫరాల కార్పోరేషన్ ద్వారా 45 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.263 కోట్లు భరించేందుకు వెనుకాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది..
కేంద్రం ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ను అందరికీ అందించాలి, ఏదో ఒక కారణాలు, కుంటి షాకులు చూపించి రేషన్ కార్డులను తొలగించడం తగదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ ద్వారా అందించే కందిపప్పు, నూనె, గోధుమపిండి, పంచదార, అయోడైజ్ద్ సాల్ట్, రాగులు, జొన్నలు మొదలగు వాటిని రేషన్ ద్వారా అందించాలి. ప్రభుత్వం పేదల ఆహార భద్రతను గుర్తించి, ఇకనైనా అందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం…
ఈకార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామారావు, పెచ్చెట్టి చిన్నారావు, వెలగల శ్రీనివాసరెడ్డి, సాధనాల సత్యనారాయణ, గనిశెట్టి వీరేష్, మేడపాటి కాసురెడ్డి, గుత్తుల కేశవరావు, సిద్దిరెడ్డి శ్రీను, చిట్టూరి శ్రీను, తోట రజని, బొంతు రాంబాబు పాల్గొన్నారు…