అటువంటి వారిని లోక్ సభ నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్న కొత్తపేట టీడీపీ ఇంచార్జ్ బండారు సత్య నందరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ వీడియో కాల్ యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. మహిళల పట్ల ఆయన వ్యవహార శైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెట్టింది, మహిళలను ఈ విధంగా ప్రలోభ పెట్టడం, కించపరచడం కాదని ఆ పార్టీ నేతలు గ్రహించాలి. గతంలోనూ కొందరు వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించిన, దానిపై రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ అధినేత పట్టించుకోలేదు. దీనితో గోరంట్ల లాంటి నేతలు శృతిమించి రాష్ట్ర పరువును కూడా బజారుకీడ్చారు. మాధవ లాంటివారు చట్టసభలకు అర్హులు కారు. లోక్ సభ స్పీకర్ ఆ దిశగా దృష్టి సారించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము….