Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

హర్ ఘర్ తిరంగా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

హర్ ఘర్ తిరంగా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://హర్ ఘర్ తిరంగా అయినవిల్లి విశ్వం వాయిస్ న్యూస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసీమ జిల్లా పరిధిలో గల అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో అజాదీకా అమృత్ మహాత్సవ్ లో భాగంగా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సముపార్జనకు ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని అటువంటి వారి త్యాగాలను నేటితరం వారికి గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గ్రామస్థాయిలో స్వచ్ఛందంగా గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఏర్పాటు చేసినందుకు గ్రామస్థులను ఆయన అభినందించారు. యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాలను గ్రామస్తులకు పంపిణీ చేసి, జెండా ఎగురవేసే సమయంలో పాటించవలసిన నియమాల కరపత్రాన్ని విడుదల చేసారు. నియమావళి ప్రకారం జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలని, జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదని. మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదని కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలని. నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషాయం రంగు ఎడమ వైపున ఉండాలని. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదని. జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదని జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదని. వివిధ అలంకరణ సామగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించరాదని. జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదని. పతాకం మధ్యలో పూలను వాడవచ్చునని వస్తువులపై, భవనాలపై జెండాను కప్పుకూడదని. దుస్తులుగా కుట్టించకూడదని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రధాన కూడలి వద్ద గాలిలోకి బెలూన్ లు ఎఇంటిటికి జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ స్వామి వివేకానంద యువత మరియు రావి ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ గుమ్మడి ప్రసాద్, ఎమ్.పి.టి.సి లు కళ్ళేపల్లి సుబ్బరాజు, ఇండుగుల వెంకటరామయ్య సహకార సొసైటీ అద్యక్షులు చిలుపూరి సాయిరాజు, మాజీ సర్పంచులు, మాజీ ఎం.పి.టి.సి లు, ఫౌండేషన్ సెక్రెటరీ పాలగుమ్మ వెంకటకృష్ణ , వికాస జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్, మండల రెవన్యూ అధికారి డి వి. ఎన్ అనిల్ కుమార్ రేవెన్యూ, సచి వాలయ , ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!