Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 2:13 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 2:13 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 2:13 PM
Follow Us

ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్ అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంపవర్మెంట్ ఫౌండేషన్, పూలే అంబేడ్కర్ యూత్, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్ నందు ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అమలాపురం డివిజన్ శాఖ అధ్యక్షులు బత్తుల నకుల రాజు గారి అధ్యక్షతన 2021-22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి మరియు మైనార్టీలకు చెందిన మండలానికి ఐదుగురు చొప్పున 8 మండలాలకు చెందిన 40 మంది విద్యార్థిని విద్యార్థులకు కులమతాలకు అతీతంగా మెరిట్ స్కాలర్షిప్స్ పేరున వెయ్యి రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి మెడల్ అభినందన ప్రశంస పత్రాలను సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ మోకా సత్తిబాబు గారు అందజేసి వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ చిన్ననాటి నుండే అంబేడ్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని చదివితే ఉన్నత శిఖరాలకు అధిరోహించగలరని , చదువు ద్వారానే అభివృద్ధి సాధించగలమని, పట్టుదల, క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్తు సాధిస్తారని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పూలే అంబేడ్కర్ ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతదని అది ఈ కోనసీమ నుండే మొదలవ్వాలని అటువంటి మహోన్నత విద్య ఉద్యమంలో నా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని తెలియజేశారు. అంతకుముందు పూలే అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి జహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయినవిల్లి జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు మండల విద్యాశాఖ అధికారి కే కిరణ్ బాబు, ఐ.ఎన్. మల్లేశ్వర రావు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోసంగి బంగార్రాజు, సాధనాల సత్యనారాయణ బిసీ ఎంప్లాయిస్ నాయకులు గుడాల నాగరాజు, మంగం సుధాకర్, శ్రీదేవి గెడ్డం ప్రదీప్, పోతుల సుభాష్ చంద్రబోస్, గూటం సాయి, పరమట నాని, గుమ్మళ్ళ శ్రీను, జల్లి శ్రీను, గొల్లమందల నాగేంద్ర, తాడి శేఖర్, నక్క సంపత్, నేతల నాని, జె. రాజ్ కుమార్, సరెళ్ళ ప్రశాంత్, మట్ట సత్తిబాబు, ఉండ్రు సత్యనారాయణ, దాసరి సత్తిబాబు, కొక్కిరి రవికుమార్, మాకే సిద్దు, ఉచ్చుల సాల్మన్, మెల్లం చిన్న, కారెం నాని, మద్దా చంటి, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement