కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:+ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ నందు 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా పల్లంకూరు పంచాయతీ సర్పంచ్ నాతి అలివేణి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించి జెండా ఎగురవేసి జాతీయగీతం తో వందనం సమర్పించారు ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి వచ్చిన స్కూల్ విద్యార్థి విద్యార్థులకు మండల ఆర్ బి కే చైర్మన్ నాతి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవే యాలని దేశభక్తిని కలిగి ఉండాలని స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామంటే ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలను సమర్పించారని వాటి యొక్క ఫలితమే మనందరం అనుభవిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీటీసీ గడ్డి తిరుపతి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ రామాడి గంగా ధర్ ఎంపీటీసీ లక్ష్మీ భవాని, జనిపల్లి శ్రీను, పండు సత్యనారాయణ, కాట్రు సత్యనారాయణ, కాశి రాముడు, బడుగు రాధాకృష్ణ, పాల్గొన్నారు