Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

స్వామిత్వ పథకం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://స్వామిత్వ పథకం అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు గురువారం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో గ్రామాల సర్వే, మ్యాపింగ్ అనేది సామాజిక-ఆర్థిక సాధికారత మరియు మరింత స్వీయ సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర-రంగ పథకంగా భారత ప్రధాని ప్రారంభించిన ఆస్తి సర్వే కార్యక్రమం స్వామిత్వ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు . గురువారం ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ జిల్లాల కలెక్టర్లతో నరేగా, స్వామిత్వ సర్వే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు కొరకు మౌలిక సదుపాయాల కల్పన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనుసంధానంతో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు ఆర్బికేలు వైయస్సార్ హెల్త్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీలు నిర్మాణాల్లో పురోగతి, సిమెంట్ సరఫరా నిధులు వినియోగంపై సమీక్షించి పనులు వేగవంతం చేసేందుకై దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ గ్రామీణ భారతదేశంలో 2021 నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా గ్రామాలను ఈ స్వామిత్వ పథకంలో సర్వే చేయను న్నారన్నారని ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్‌లతో సహా వివిధ సాంకేతికతను ఉపయో గిస్తున్నారన్నారు. స్వామిత్వ గ్రామాల సర్వే మరియు గ్రామ ప్రాంతాలలో మెరుగైన సాంకేతి కతతో మ్యాపింగ్ ప్రాజెక్ట్ అని ఆర్థిక లిక్విడిటీని పెంచుతూ ఖచ్చితమైన భూ రికార్డులను అందించడం ద్వారా ఆస్తి వివాదాలను తగ్గించడానికి ఈ పథకం ఉద్దేశించ బడిందన్నారు. ప్రణాళిక మరియు ఆదాయ సేకరణను క్రమబద్ధీ కరించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి హక్కుల గురించి నివాసితులకు తెలియజేయడం ఈ పథకం లక్ష్యమన్నారు.స్వామిత్వ సర్వే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియూ భూ రక్షణ కార్యక్రమం మాదిరిగానే కోనసీమ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో ఆస్తి కార్డులను ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వామిత్వ సర్వే కార్యక్రమం గ్రామాలలోని వ్యవసాయ భూములు మరియు ఇండ్లు ,స్థలాలకు ఆస్తి కార్డులు ఇవ్వడం కోసం ప్రారంభించ బడిందన్నారు. జిల్లాలోని మొత్తం గ్రామ పంచాయితీలు 385, పైలట్ ప్రాతిపదికన తీసుకున్న గ్రామాల సంఖ్య 2, డ్రోన్ సర్వే పూర్తి చేసిన గ్రామాల సంఖ్య 134, కాగా, 9 ఆవాసాల మ్యాప్ లో స్వీకరించడం జరిగింది. గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేసిన గ్రామాల సంఖ్య 9,కాగా గ్రౌండ్ ధ్రువీకరణ మ్యాప్‌లు అందుకున్న గ్రామాల సంఖ్య 3 అని తెలిపారు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న అమలాపురం డివిజన్ పరిధిలో అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామంలో 650 అంచనాలు గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా రామచంద్రపురం డివిజన్ లో రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో 853 అం చనాలు, గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి అందుకున్న ORI మ్యాప్‌ల ప్రకారం, గ్రౌండ్ ట్రూథింగ్ కొనసాగుతోందన్నారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబ యజమానికి ఆధార్ కార్డు మాదిరిగానే ప్రత్యేక నంబర్ తో గుర్తింపు కార్డు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు డి పి ఓ ఆర్ విక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ ఎస్ ఈ చంటిబాబు ,డ్వామా పిడి మధుసూదన్. తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!