Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 8:03 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 8:03 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 8:03 AM
Follow Us

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

http://గోకుల కృష్ణ…గోపాలకృష్ణ.. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు… రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: దశావతారాలలో పరిపూర్ణమైన అవతారం కృష్ణ అవతారం దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా అవతార్ స్వీకారం చేసిన రోజున కృష్ణాష్టమిగా హిందువులు పిలుచుకుంటూ కృష్ణుడు తన చిన్నతనంలో గోపికలతో చేసిన చిలిపి అల్లర్లును గోపికలు దాచిన పాలు వెన్న నెయ్యి కృష్ణుడి తన గోపాల బాలురతో కలసి దొంగతనంగా ఆరగించేవాడు అందుకని గోపికలు పాలు వెన్న నెయ్యి ఉట్టి మీద పెట్టి కృష్ణుడికి అందకుండా దాచేవారు అయినా కృష్ణుడు తన గోపాల బాలురను ఒంగోపెట్టి ఒకరి మీద ఒకరిని నిలబెడుతూ కృష్ణుడు పైకి ఎగబాకి పుట్టిన కొట్టి పాలు వెన్న నెయ్యి గోపాల బాలురకు పంచిపెట్టేవాడు అలనాటి కృష్ణ లీలలు కు గుర్తుగా గోవిందుడు అందరివాడేలే అంటూ గోపికమ్మలు తమ చిలిపి చేష్టలతో గోపాలుణ్ణి ఆటపట్టించిన వైనంతో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం వాసుదేవ యాదవుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్దంగా ఉట్టి కొట్టి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కృష్ణుని జననం ప్రపంచానికి మేలు చేకూర్చిందని నమ్మిక. కృష్ణతత్వంలోనే పరమార్ధం ఉందని విశ్వాసం. గీతోపదేశం ద్వారా ప్రపంచానికి మానవాళి మనుగడకు మార్గదర్శకం ఇచ్చిన భగవంతుని సారాన్ని కృష్ణుని అవతారంలో కొలవడం ఆనవాయితీ. అలరే కృష్ణయ్య ….. రావయ్యా మా ఇంటికి అంటూ జానపదాలు ఆలపించారు. చిన్ని కృష్ణుని గెటప్ లో చిన్నారులు ఎంతగానో ఆకట్టుకున్నారు. హొయలొలొకించే బుల్లి గోపికలు ముచ్చటగొలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం నిర్వహించారు. ఉట్టి కొడుతూ ఉత్సాహం, కేరింతలు… దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో బాల బాలికలు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న యువత గాలిలో ఎగురుతూ ఉట్టికొట్టారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు కాపాడడం ఎంతో ముఖ్యమని, భావితరాలకు హిందూ పండుగలు తెలుగు సంస్కృతిని తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని వాసు దేవ యాదవ సంఘం నాయకులు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement