Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 9:32 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 9:32 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 9:32 AM
Follow Us

ప్రభుత్వ పథకాలు అమలకు బ్యాంకులు రుణాలు ఇచ్చి సహకరించాలని కోరిన కలెక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అమలాపురం ఆగస్టు 20: బ్యాంకు రుణంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాల మంజూరులో బ్యాంకర్లు ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా తోడ్పాటునoదించి నిర్దేశత లక్ష్యాలు చేరుకునే విధంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా బ్యాంకర్లను కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు బ్యాంకర్ల మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జగనన్న తోడు తదితర పథకాల లబ్ధిని లక్షిత వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా చేర్చడంలో బ్యాంకులు తోడ్పాటు ఎంతో అవసరమని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు లవారీగా వివిధ పథకాల మంజూరు కొరకు నిర్దేశించిన లక్ష్యాలను సమీక్షించి పదకాల మంజూరులో మరింత ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కొన్ని బ్యాంకు బ్రాంచీలు ప్రభుత్వ పథకాలు మంజూరు విషయంలో వెనుకబడి ఉండడాన్ని ఆయన గుర్తించి పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స‌మాజాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీల‌క‌మైంద‌ని. ముఖ్యంగా నిరుపేద‌ల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలను విజ‌య‌వంతంగా అమ‌లుచేసేందుకు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంత‌గానో తోడ్ప‌డు తోంద‌న్నారు. ఒక వ్య‌క్తి మరో ప‌ది మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే స్థాయికి ఎదిగేలా చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు బ్యాంకుల స‌హాయంతో వివిధ కార్య‌క్ర‌మాలుఅమ‌లుచేస్తున్నాయ‌ని వీటిని యువతీ యువకులు స‌ద్వినియోగం చేసుకునే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, బ్యాంక్ అధికారులు తోడ్పాటు నo దించాలని సూచించారు. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటుచేసుకొన్న యూనిట్ల‌ను జాగ్ర‌త్త‌గా, ముందుచూపుతో అభివృద్ధి పథంలో ప‌య‌నించేలా బాధ్యతాయుతంగా నిర్వహణ చేపట్టేలా డీఆర్డీఏ అధికారులు తగిన ప్రోత్సాహాన్ని, అవగాహన పెంపొందించాలన్నారు .ఉత్ప‌త్తి చేస్తున్న వ‌స్తువుల డిమాండ్‌, మార్కెటింగ్ అవ‌కాశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ మెరుగైన లాభదాయకమైన విధానాల ద్వారా అభివృద్ధి సాధించాల‌న్నారు. ప్ర‌జలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు బ్యాంకుల సేవ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డు తున్నాయ‌ని. వ్య‌వ‌సాయ‌, విద్యా రైతు వారి రుణాల‌పై మ‌రింత దృష్టిసారించాల‌ని ఈ సంద‌ర్భంగా బ్యాంక‌ర్ల‌కు సూచించారు . ఒక్క రుణాలే కాకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీ త‌నంతో ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు విజ‌య‌వంతం కావ‌డంలో బ్యాంకింగ్ రంగ సేవ‌లు కీల‌కంగా మారాయన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క్యాలెండర్ ప్రకారం ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నందున ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల్లో న‌గ‌దు జమ చేసేందుకు బ్యాంకుల్లో ప్ర‌త్యేక కౌంటర్లు ఏర్పాటుచేయాల‌ని క‌లెక్ట‌ర్ బ్యాంక‌ర్ల‌కు సూచించారు. దీనివ‌ల్ల ల‌బ్ధిదారుల‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ప‌రిష్క‌రించి, ప‌థ‌క ఫ‌లాలు పూర్తిస్థాయిలో అందించేందుకు వీలవు తుంద‌న్నారు. డిజిట‌ల్ లావాదేవీలు-భ‌ద్ర‌త‌పై పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలని కోరారు. బ్యాంకులు అందిస్తున్న రుణాల‌ను స‌ద్వినియోగం చేసుకొని ల‌బ్ధిదారులు వ్యాపారంలో రాణిస్తూ పేదరికం జయించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాల‌ను నిర్దేశ గ‌డువులోగా తిరిగి చెల్లించి మ‌ళ్లీ మ‌ళ్లీ రుణాలు పొందుతూ వ్యాపారాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవాల‌న్నారు. ప్రభుత్వ పథకాలు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తూ . బ్యాంకు రుణంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాలు అమలుతీరు పై అధికారులతో పాటు బ్యాంకర్ల కూడా అవ‌గాహ‌న క‌ల్పించి న‌మోద‌య్యేలా చేసేందుకు తమ వంతు తోడ్పాటును అందించాలని స్పష్టం చేశారు. భ‌ద్ర‌మైన డిజిట‌ల్ చెల్లింపులు, ఆర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న లబ్ధిదారులలో పెంపొం దించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్డిఏ పిడి ఎంఎం జిలాని ,ఎల్డిఎం లక్ష్మీనారాయణ వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఎస్బిఐ చక్రవర్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవీణ్, శ్యాంబాబు, హెచ్డిఎఫ్సి గణపతిరావు దుర్గాప్రసాద్ శ్రీనివాసరావు డిపిఎం అన్నపూర్ణ డిపిఎంలు ఏరియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement