Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 3:20 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 3:20 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 3:20 PM

ఉమ్మడి జిల్లాలలో ఎరువులు పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక దాడులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఉమ్మడి జిల్లాలలో ఎరువులు పురుగుమందులు దుకాణాలపై ఆకస్మిక దాడులు

 

అమలాపురం (విశ్వం వాయిస్ న్యూస్):-

 

ఉమ్మడి జిల్లాలలో కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శనివారం నాడు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ బి బాగ్సి ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు ఎస్పీ పి.వి రవికుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కాకినాడ, తూర్పుగోదావరి ,మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంయుక్తముగా బయో ప్రొడక్ట్స్ ఎరువులు, పురుగు మందులు దుకాణాలు పై ఆకస్మిక దాడులు శనివారం నాడు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం కడియం గ్రామంలోని వీర కుమారి ట్రేడర్స్ బయో ప్రొడక్ట్స్ ఎరువులు పురుగుమందులు దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు అక్కడ బయో ప్రోడక్ట్ పురుగుమందులకు సంబంధించిన పత్రాలు అనుమతులు లేని కారణంగా స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడంవలన మండల వ్యవసాయ అధికారి కడియం వారు ఒక లక్షా 39 విలువగల సుమారు 26.80 లీటర్ 144 కేజీల బయో ప్రోడక్ట్ ను మరియు 20.87 లక్షల రూపాయల విలువ గల 28.4 లీటర్లు 1. 39 కేజీల పురుగుమందుల నిల్వల అమ్మకమును నిలుపుదల చేసి ఉన్నారు అందువలన ఎరువులకు సంబంధించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 3.400 రూపాయల విలువ గల సుమారు 2.3 కేజీల జింక్ సల్ఫేట్ ను సీజ్ చేసి సదరు దుకాణం పై మండల వ్యవసాయ అధికారి 6-ఎ కింద కేసు నమోదు చేశారు వేరే కుమారి ట్రేడర్స్ గల బయో ప్రొడక్ట్స్ నమూనాలు విశ్లేషణ నిమిత్తం సేకరించి ఉన్నారు అలాగే కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గ్రామంలోని వాసవి ఆగ్రో ఏజెన్సీ ను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఎరువులు నిల్వలలో వృత్యాసము ఉన్నందున మరియు స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం వలన మండల వ్యవసాయ అధికారి గొల్లప్రోలు వారు 6-ఎ కింద కేసు నమోదు చేసి 6.13 లక్షల రూపాయలు సుమారు 60వేల 695 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు తదుపరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలోని మడికి గ్రామంలో తులసి ట్రేడర్స్ బయో ప్రొడక్ట్స్ ఎరువుల దుకాణంలో తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు అక్కడ గల ఎరువుల నిల్వలలో తక్కువ మొత్తము వ్యత్యాశము ఉండటం వలన స్టాక్ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించకపోవడం వలన మండల వ్యవసాయ అధికారి రు1.44 లక్షల విలువగల సుమారు 8.24 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకమును నిలువుదల చేశారని సదరు తులసి ట్రేడర్స్ లో బయో ప్రొడక్ట్స్ నమూనాను విశ్లేషణ నిమిత్తం సేకరించి ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!