Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 4:21 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 4:21 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 4:21 PM
Follow Us

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం:-

 

అమలాపురం (విశ్వం వాయిస్ న్యూస్):-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంనియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయం నందు జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం శనివారం నాడు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పథకములు అన్ని సక్రమంగా అమలు చేయాలని రైతు భరోసా కౌలు రైతులకు అందేలాగా చూడాలని మరియు సంబంధిత అన్ని శాఖలు రైతులకు అన్ని విధములుగా సహకరించాలని తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి వై ఆనందకుమారి మాట్లాడుతూ జూలై నెలలో తీర్మానించిన అంశములపై తీసుకున్న చర్యలు గురించి మరియు ఆగస్టు నెలలో ఆర్బికే మండల వారీగా జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశముల గురించి వివరించడం జరిగింది తదుపరి గుబ్బల రమేష్ సలహా మండలి సభ్యులు రాజోలు మరియు అగ్రికల్చర్ మిషన్ సభ్యులు రామారావు మాట్లాడుతూ ఇరిగేషన్ సంబంధించి మేజర్ డ్రైన్ లు కోనసీమ జిల్లా పరిధిలో ఉన్నవి కనుక ఈ ఈ డ్రైన్ కాకినాడ పోస్ట్ ని కోనసీమ జిల్లాకు కేటాయించమని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాకుండా బయట మార్కెట్లో అమ్మకానికి సంబంధించిన ధాన్యం సర్వే నెంబర్లు కొనుగోలు జరగకుండా ఆపివేయాలని వారు కోరడమైనది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్,అగ్రికల్చర్ మిషన్ మెంబర్ రామారావు జిల్లా వ్యవసాయ అధికారి వై ఆనంద కుమారి నీటిపారుదల శాఖ అధికారులు పశుసంవర్ధక శాఖ ,ఫిషరీస్ శాఖ , ఉద్యానవన శాఖ సివిల్ సప్లై ,పి.డి ఆత్మ ఏపీ మార్కెట్ ఫీడ్ ఏ.పీ సీడ్స్ మరియు జిల్లా స్థాయి అధికారులు కమిటీ సభ్యులు సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement