విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
వినాయక చవితి మండపలకు ముందుగా అనుమతులు తీసుకోవాలి పట్టణ సీ.ఐ
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాలలో
వినాయక చవితి సందర్భముగా మండపాలు ఏర్పాటు చేసుకునే వారు ఖచ్చితంగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని
మండపాలు రోడ్ మీద కానీ ట్రాఫిక్ పాయింట్లలో కానీ వుండరాదని
మండపాలను ఏర్పాటు చేసేవారు వారికి చెందిన ప్రైవేటు స్థలములో ఏర్పాటు చేసుకోవాలని
అనుమతి దరఖాస్తులో స్థలం స్వంతదారు యొక్క అనుమతి పత్రం జత చేయాలి.
మైక్ ఉపయోగించేవారు డీఎస్పీ నుండి మైక్ పర్మిషన్ విధిగా పొందాలి..
వినాయక చవితి కమిటీ ఏర్పాటు చేసి, మండపం కాపలా మనిషి ఉండాలని
అనుమతి కోసం దరఖాస్తు చేసే సమయంలోనే విగ్రహం ఎత్తు, ఏ రోజు ఎక్కడ నిమజ్జనం చేస్తారు వంటి వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి.
మండపాల వద్ద జరిగే ఎటువంటి అసాంఘిక కార్యకలాపానికి అయిన సదరు వినాయక చవితి మండప కమిటీ వారు బాధ్యులు అవుతారు.
అనుమతి తీసుకోకుండా మండపాలు ఏర్పాటు చేసేవారిపై తగు చర్యలు తీసుకోబడతాయి. చవితి పందిళ్ళ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి పండుగ
జరుపుకోవాలని ప్రజలకు పట్టణ సిఐ కొండలరావు తెలిపారు….