Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

యదేచ్ఛగా రహదారుల ఆక్రమణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

యధేచ్చగా రహదారుల ఆక్రమణలు

 

— చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు…

– తొలగింపుకు కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు…

– ఇరుకు రోడ్లతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు…

– శిధిలావస్థకు చేరిన రహదారి…

– ప్రయాణీకులకు నిత్యం ప్రత్యక్ష నరకం…

 

 

 

రాయవరం, విశ్వం వాయిస్ ప్రత్యేక ప్రతినిధి న్యూస్ సి. హెచ్.ప్రతాప్: మండల కేంద్రమైన రాయవరం గ్రామం లో ఆర్ అండ్ బి రోడ్లకు ఇరువైపులా కొందరు ఆక్రమణలకు పాల్పడుతూ శాశ్వత గృహాలు నిర్మించుకోవడం, మరికొందరు తమ వ్యాపారాల విస్తరణ కోసం షెడ్లను నిర్మించుకొని , పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. అసలే ఇరుకు రోడ్లు, ఈ తరహా ఆక్రమణల కారణంగా మరింత ఇరుకైపోతున్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం చట్ట రీత్యా నేరమే అయినా ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వలన ఆక్రమణదారులు యద్ధేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

 

ప్రభుత్వాలు మారిన మార్పులేని రాయవరం రోడ్డు:

గత ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు కూడా రాయవరం మెయిన్ రోడ్డు రహదారిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ రహదారి వెంట వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా వుంటాయి.గతంలో ఇరుకైన ఈ రోడ్డును విస్తరించేందుకు నిధులు మంజూరు అయ్యాక అధికారులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపుల వున్న ఆక్రమణలను తొలగించారు.అయితే రోడ్డు విస్తరణ కార్యక్రమం సరిగ్గా సాగినందున తిరిగి కొందరు రోడ్డును ఆక్రమించే ప్రక్రియ ప్రారంభించారు. రోడ్డు ఇరువైపులా అక్కడక్కడ ముందస్తు అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేశారు. నిత్యం మండల కేంద్రానికి విచ్చేసే ప్రజలకు ఈ ఇరుకు రోడ్ల వలన ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. దీనికి తోడు మరమ్మత్తులు చేపట్టకపోవడం వలన రహదారి అంతా గుంతల మయం అయిపోయి వాహనచోదకులకు ప్రత్యక్ష నరకంచూపిస్తోంది. కొద్దిపాటి వర్షం వస్తే చాలు బురద నీరంతా రోడ్లపైనే నిలిచిపోతోంది.వర్షాకాలం ముందే మరమ్మత్తులు చేపట్టకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలగలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

 

రోడ్డుపై ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు గ్రామస్తుడు వినతి :

 

ఈ ఆక్రమణలను తొలగించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ కు రాయవరం గ్రామానికి చెందిన సబ్బెల వెంకటరామిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేయగా, కలెక్టర్ తక్షణం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు బేఖాతరు చేసారు. ఆక్రమణదారులకు కనీసం నోటీసులు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ,స్థానిక అధికారుల నిర్లక్ష్య వైఖరి వలనే ఆక్రమణల పర్వం యధేచ్చగా సాగుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

బుక్ స్టాల్ తొలగించారు… మరి మిగతా అక్రమ దారులు ఎందుకు తొలగించేలాగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చేయలేదు…

 

కొన్ని నెలల క్రితం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ హైస్కూలు గేటు వద్ద దళిత పేటకు చెందిన ఇద్దరు యువకులు వారి జీవనోపాధి నిమిత్తం విద్యార్థులు సౌకర్యార్థం బుక్ స్టాల్ ను తోపుడి బండి పై ఏర్పాటు చేశారు. స్కూలు ప్రారంభోత్సవం నేపథ్యంలో బుక్ స్టాల్ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజును ఆహ్వానించగా అప్పటికే ముందస్తు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఈ బుక్ స్టాల్ ను తొలగించాలని గ్రామ నాయకులు, అధికారుల చెప్పడంతో ఆ నిరుద్యోగ యువకులు తక్షణం వారిమాట పాటించి అక్కడనుండి బుక్ స్టాల్ ను తీసివేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

ఇదిలా ఉండగా రాయవరం వెలమ కళ్యాణ మండపం వద్ద రోడ్డును ఆక్రమించి కొందరు ఒక షెడ్డును ఏర్పాటు చేసారు. ఈ కట్టడం వెనుక వున్న ఒక గృహానికి అడ్డంగా వుందని యజమాని సబ్బెల వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా ఈ ఆక్రమణలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా ఆక్రమణల పర్వం యధేచ్చగా సాగుతున్న నేపధ్యంలో అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఒక తర్వాత మరొకరు ఆక్రమణలకు పాల్పడుతునే వుంటారని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ కథనానికి స్పందించి రాయవరంలో రోడ్డుపై అక్రమణలు తొలగించి, రోడ్డుకు తక్షణం మరమ్మత్తులు చేయించి అలాగే ఇరు ప్రక్కల డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామానికి మేలు చేకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోగలరని గ్రామస్తులు కోరుతున్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!