Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 8:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 8:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 8:16 AM

ఉక్కుమనిషి ఆంధ్ర కేసరి 151 వ జయంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఉక్కుమనిషి ఆంధ్ర కేసరి 151 వ జయంతి వేడుకలు

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంగళవారం నాడు స్థానిక కలెక్టరేట్ నందు టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరిని స్వాతంత్ర్య సమరయోధులలో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారని తెలిపారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు నిర్ణాయక పాత్ర పోషించారన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు 23 ఆగష్టు 1872 జన్మించారన్నారు. భారతీయ న్యాయనిపుణుడుగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా మరియు వలసవాద వ్యతిరేక జాతీయవాదిగా, అతను మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. టంగుటూరి తదనంతరం మద్రాసు రాష్ట్ర విభజన ద్వారా భాషాపరంగా ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు . టంగుటూరిని “ఆంధ్ర కేసరి” అని పిలిచేవారన్నారు .ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ ద్వారా1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై ఓ త్తిడి పెరిగిందని, కమ్యూనిస్టులతో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడి 1953లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయగా తదుపరి తన నివేదిక సమర్పించిందని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కమిటీ సమర్ధించిందని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించిందన్నారు . అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించిందన్నారు . కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు ఉన్నారని, హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు ఆంధ్రప్రదేశ్‌ను సమర్ధించారన్నారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, ఎక్కువ మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, కొద్దిమంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. చాలా తక్కువ మంది తటస్థంగా ఉండిపోయారన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించిన ప్రముఖ నాయకులలో బూరుగుల రామకృష్ణా రావు,, స్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారన్నారు. ఈ నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసాయన్నారు. అప్పట్లో పలువురు మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్‌నే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసారన్నారు .ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమ య్యారన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరిందని,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు 1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించిందన్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు .ఇదిలా ఉండగా, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారన్నారు తదుపరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మరియు కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎంపిక చేయడo జరిగిందన్నారు. ఒంగోలు సమీపంలో తీవ్ర వడదెబ్బకు గురై. అతను హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి 20 మే 1957 న మరణించార న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!